పిల్లల హత్య: ప్రియుడితో కన్ను గీటు వీడియో కాల్స్, మలయాళం నటికి పోటీ: వైరల్!
Recommended Video
చెన్నై: ప్రియుడి మోజులో పడి ఇద్దరు కన్నబిడ్డలకు విషం పెట్టి హత్య చేసిన చెన్నై కామాంధురాలు అభిరామి వ్యవహారం రోజుకు ఒకటి వెలుగు చూస్తోంది. ప్రియుడు సుందరంతో వీడియో కాల్స్ లో మాట్లాడిన అభిరామి అతన్ని రెచ్చగొడుతు, కన్ను గీటుతూ మాట్లాడిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నాడు పెళ్లి చెయ్యకుంటే చస్తానంది, నేడు రెండు నెలల ప్రియుడి కోసం చంపేసింది!
అభిరామి కన్న బిడ్డలను చంపిన విషయం తెలిసిన వ్యక్తులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అభిరామి, సుందరం ఇద్దరి మొబైల్ ల్సో ఉన్న వీడియోలు, ఫోన్ కాల్స్ డేటా, ఫోటోలు తదితర వివరాలు సేకరించిన పోలీసులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
నటి ప్రియా వారియర్
మలయాళ నటి ప్రియా వారియర్ నటించిన ఒరు ఆదార్ లవ్ అనే సినిమాలోని ఓ పాట చాల పాపులర్ అయ్యింది. ఆ పాటలో ప్రియా వారియర్ ఓ యువకుడిని చూసి కన్ను గీటుతుంది. ప్రియా వారియర్ కన్ను గీటిన వీడియో రాత్రికి రాత్రే పాపులర్ కావడంతో ప్రియా వారియర్ ఒక్క రోజులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
హీరోయిన్ లా ఫీలైయ్యింది
కీచకురాలు అభిరామి గతంలో ప్రియుడు సుందరంతో అనేక సార్లు వీడియో కాల్స్ లో మాట్లాడింది. ఆ వీడియో కాల్స్ లో అచ్చం ప్రియా వారియర్ కన్ను గీటునట్లు తాను కన్ను గీటుతో ప్రియుడు సుందరంతో మాట్లాడటానికి అభిరామి ప్రయత్నించింది. ఆ వీడియోల్లో అభిరామి హీరోయిన్ ల ఫీల్ అయిన విషయం స్పష్టంగా కనపడుతోంది.
వీడియోలు లీక్
అభిరామి కన్ను గీటుతూ మాట్లాడిన వీడియోలు బుధవారం లీక్ అయ్యాయి. ఒకరి నుంచి ఒకరికి షేర్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిరామి, సుందరం మాట్లాడుకుంటున్న వీడియోలు ఎలా లీక్ అయ్యాయి అనే విషయంపై ఇప్పుడు జోరుగా చర్చ మొదలైయ్యింది.
ఫోన్ లో మునిగిపోతుంది
భర్త ఇంటిలో లేకపోయినా, పిల్లలు ఉన్నా సరే అభిరామి నిత్యం ఫోన్ లో ప్రియుడు సుందరంతో మాట్లాడుతుందని, వేరే ద్యాస ఏమీ ఉండదని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఫోన్ లో సుందరంతో మాట్లాడుతున్న సమయంలో పిల్లలు ఏదైనా అడిగితే వారిని అభిరామి చితకబాదేదని ఆమె ఇంటి ఇరుగు పోరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిసింది.