చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా హాట్ స్పాట్ కోయంబేడు మార్కెట్ క్లోజ్, ఒక్క దెబ్బకు వందల మందికి, పాపం!

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేసినా ఏదో ఒక విధంగా కరోనా వ్యాధి ప్రజలకు వ్యాపిస్తోంది. తమిళనాడులో 3, 550 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా మారింది. చెన్నైలోని ఇప్పటి వరకు మొత్తం 1, 724 కరోనా పాజిటివ్ కేసులు నిర్దరాణ అయ్యాయి.

చెన్నై సిటీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో కోయంబేడు మార్కెట్ ను అధికారులు మూసివేశారు. కోయంబేడు మార్కెట్ కు తమిళనాడులోని పలు జిల్లాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఎవ్వరూ రాకుండా అధికారులు ఆంక్షలు విధించారు. కోయంబేడు మార్కెట్ కారణంగా వంద మందికిపైగా కరోనా వైరస్ వ్యాపించిందని అధికారులు అంటున్నారు.

100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!100 మంది అమ్మాయిలు, ఆంటీలకు వల, కామాంధుడు, నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్, పాపం లేడీ డాక్టర్!

చెన్నై కోయంబేడు మార్కెట్

చెన్నై కోయంబేడు మార్కెట్

తమిళనాడు రాజధాని చెన్నై సిటీలోని కోయంబేడు మార్కెట్ లో కొన్ని వేల దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు తమిళనాడులోని ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కోయంబేడు మార్కెట్ కు వ్యాపారులు వస్తుంటారు. కోయంబేడు మార్కెట్ విషయంలో అధికారులు కొంచెం నిర్లక్షం చెయ్యడంతో ఇప్పుడు కరోనా విషయంలో మొదటికే మోసం వచ్చిందని తమిళనాడు ప్రభుత్వం విచారణలో వెలుగు చూసింది.

కరోనా హాట్ స్పాట్ కోయంబేడు మార్కెట్

కరోనా హాట్ స్పాట్ కోయంబేడు మార్కెట్

కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్ కు హాట్ స్పాట్ అయ్యిందని ప్రభుత్వం గుర్తించింది. కోయంబేడు మార్కెట్ లో కేవలం 200 హోల్ సేల్ వ్యాపారస్తులు మాత్రమే వ్యాపారం చెయ్యడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ మార్కెట్ అన్ని ప్రవేశ ద్వారాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోయంబేడు మార్కెట్ ను తాత్కాలికంగా తిరుమలైసాయి ప్రాంతానికి తరలించారు.

కరోనా వైరస్ చైన్ లింక్

కరోనా వైరస్ చైన్ లింక్

కోయంబేడు మార్కెట్ లో వ్యాపారం చెయ్యడానికి వచ్చిన వారిలో ఒకరి నుంచి మరోకరికి కరోనా వైరస్ వ్యాపించిందని అధికారులు గుర్తించారు. కోయంబేడు మార్కెట్ కారణంగా చెన్నై జిల్లాలో 102, అరియలూరులో 22, విళపురంలో 58, కాంచీపురంలో 7, కడలూరులో 26, పెరంబూరులో ఒకరికి కరోనా వైరస్ వ్యాపించిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఒక్క దెబ్బకు 119 మందికి కరోనా

ఒక్క దెబ్బకు 119 మందికి కరోనా

చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కారణంగా ఇప్పటి వరకు 119 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్దారణ అయ్యింది. అదే విదంగా మరో 550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వైద్యశాఖ అధికారులు అంటున్నారు.

ఒక్కరోజులో 527 కరోనా పాజిటివ్

ఒక్కరోజులో 527 కరోనా పాజిటివ్

తమిళనాడులో ఒక్క సోమవారం మాత్రమే 527 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం హడలిపోయింది. సోమవారం ఒక్కరోజు దెబ్బతో తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3, 550కి పెరిగిపోయింది. చెన్నైలో బయటపడిన 266 కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం కోయంబేడు మార్కెట్ నుంచి వ్యాపించాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది. కరోనా వైరస్ కు హాట్ స్పాట్ అయిన కోయంబేడు మార్కెట్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.

English summary
Coronavirus: Chennai Koyambedu market may temperaverly closed, shops may shift to thirumalisai due to stop to coronavirus spread in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X