చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TikTok: పోలీసు అధికారి పోటుగాడు, కరోనా కాలంలో పోయేకాలం, అమ్మాయిలు, ఆంటీలతో రోజుకు 20 సార్లు !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ వ్యాధి ఏ రైంజ్ లో వ్యాపిస్తుందో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. భారతదేశంలో రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న సమయంలో వైద్య సిబ్బంది, పోలీసులు, వివిద శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది సెలవులు కూడా తీసుకోకుండా ప్రతిరోజు విధులకు హాజరౌతున్నారు. దేశంలో కరోనా వైరస్, లాక్ డౌన్ విధుల్లో శక్తి వంచన లేకుండా పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్మికులు, పోలీసులను స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అయితే రోజుకు 24 గంటలు అయితే రోజుకు 20 టిక్ టాక్ వీడియో పోస్టు చేస్తూ కాలం వెళ్లదీస్తున్న ఓ పోలీసు అధికారి భాగోతం ఇప్పుడు బయటపడింది. అసలే ఆయన పని చేస్తున్న సిటీలో 45 వేల కరోనా పాజిటివ్ కేసులు ఉంటే మన జల్సారాయుడు అమ్మాయిలు, ఆంటీలతో డబుల్ మీనింగ్ డైలాగ్ లు వేస్తూ, అసభ్యంగా మాట్లాడుతూ, రొమాంటిక్ పాటలు పాడుతూ రోజుకు 20 టిక్ టాక్ వీడియోలు పోస్టు చేస్తూ కాలం వెళ్లదీస్తున్న విషయం వెలుగు చూడటంతో ప్రభుత్వం, పోలీసు అధికారులతో పాటు ప్రజలు షాక్ కు గురైనారు.

Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్తLockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త

దేశంలో ఇది పోలీసు పరిస్థితి

దేశంలో ఇది పోలీసు పరిస్థితి

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపించడం మొదలైనప్పటి నుంచి వైద్యులు, పోలీసులు, పారిశుద్ద కార్మికులతో పాటు అనేక శాఖల అధికారులు సెలవులు కూడా తీసుకోకుండా పని చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాధి సోకి విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ద కార్మికులు ముఖ్యంగా పోలీసు అధికారులు, పోలీసులు మరణించిన విషయం తెలిసిందే.

67 వేల కరోనా కేసులు

67 వేల కరోనా కేసులు

తమిళనాడులో కరోనా వైరస్ వ్యాధి కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంఖ్య చూస్తుంటే దేశం మొత్తం హడలిపోతుంది. దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్ ఓ తుపానులా దూసుకుపోతున్న రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో బుధవారం వరకు 57, 468 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇక చెన్నై సిటీలో ఇదే వారంలో కరోనా వైరస్ వ్యాధి సోకి ఓ ఇన్స్ పెక్టర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

చెన్నైలో 45, 814 కరోనా కేసులు

చెన్నైలో 45, 814 కరోనా కేసులు

తమిళనాడులో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో సుమారు 70 శాతం కేసులు ఒక్క చెన్నై సిటీలోనే ఉన్నాయి. చెన్నై సిటీలో 45, 814 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయని అధికారికంగా ప్రభుత్వం చెప్పింది. చెన్నై సిటీలో ఇప్పటి వరకు కరోనా వైరస్ చికిత్స విఫలమై 33 మంది మరణించారు. కరోనా వైరస్ వ్యాధి నయం చేసుకుని 37, 763 మంది డిశ్చార్జి అయ్యారు. తమిళనాడులో ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాధితో 866 మంది మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది.

పోలీసు అధికారి పోటుగాడు

పోలీసు అధికారి పోటుగాడు


చెన్నై చీఫ్ సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ లో కళ్యాణసుందరం (53) అసిస్టెంట్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. కళ్యాణసుందరం నేను చాలాపోటు గాడు అని ఫీలైపోతున్నాడని సమాచారం. 2019 ఏప్రిల్ నెల నుంచి కళ్యాణసుందరం టిక్ టాక్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసి పాపులర్ కావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. టిక్ టాక్ ఊపు అందుకున్నప్పటి నుంచి పోలీసు అధికారి కళ్యాణసుందరంకు టిక్ టాక్ పిచ్చి పట్టుకుంది.

 అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్

అమ్మాయిలు, ఆంటీలతో ఎంజాయ్

దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు వారి ప్రాణాలను లెక్కచెయ్యకుండా వారివారి రాష్ట్రాల్లో కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతిరోజు విధుల్లో నిమగ్నం అయ్యారు. అయితే చెన్నైలోని పోలీసు అధికారి కళ్యాణసుందరం మాత్రం ప్రతిరోజు యుగళగీతాలు, డబుల్ మీనింగ్, బూతు పాటలు, డబుల్ మీనింగ్ డైలాగులతో అమ్మాయిలు, ఆంటీలతో కలిసి పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.

రోజు 24 గంటలు, 20 టిక్ టాక్ వీడియోలు

రోజు 24 గంటలు, 20 టిక్ టాక్ వీడియోలు

పోలీసు అధికారి కళ్యాణసుందరంకు టిక్ టాక్ పిచ్చి పట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల టిక్ టాక్ వీడియోలు పోస్టు చేశాడు. రోజుకు 24 గంటలు అయితే కళ్యాణసుందరం రోజుకు 20 టిక్ టాక్ వీడియోలు పోస్టు చేస్తున్నాడు. కళ్యాణసుందరం ఆయన ఎంత సిన్సియర్ గా ఉద్యోగం చేస్తున్నాడో ఈ టిక్ టాక్ వీడియోలు చూస్తే అర్థం అవుతోంది.

పోలీసుల పరువు తీశాడు !

పోలీసుల పరువు తీశాడు !


చెన్నై పోలీసు అధికారి నిత్యం టిక్ టాక్ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసి పోలీసుల పరువు తీస్తున్నాడని సాటి పోలీసు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 53 ఏళ్ల వయసు ఉన్న కళ్యాణసుందరం ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్ లతో అసభ్యంగా పాటలు పాడుతూ పోస్టు చేస్తున్నాడని, ఇలా ఆయన యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడని నెటిజన్లు మండిపడుతున్నారు. కళ్యాణసుందరం టిక్ టాక్ వీడియోలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తమిళనాడు ప్రభుత్వంతో పాటు చెన్నై సిటీ పోలీసులు సీరియస్ అయ్యారు.

English summary
Chennai lockdown: Policemans controversy Tik Tok video in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X