చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెట్రో రైలులో బ్లాక్ బాక్స్ లు

|
Google Oneindia TeluguNews

చెన్నై: మెట్రో రైలు ప్రయాణం సురక్షితం చెయ్యడానికి చెన్నై అధికారులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమాదాలు నమోదు చెయ్యడానికి వీలుగా విమానాల్లో ఏర్పాటు చేసే బ్లాక్ బాక్స్ లను చెన్నై మెట్రో రైలులో అమర్చారు. మెట్రో రైలు ప్రయాణికులు విషయం తెలుసుకుని సంతోషంగా ఉన్నారు.

సుందర చెన్నైని మరింత సుందరంగా మారుస్తూ నిర్మితమైన అత్యాధునిక మెట్రో రైలు గత ఏడాది (2015) జూన్ ప్రారంభం అయ్యింది. మొత్తం 45.1 కిలోమీటర్ల దూరం మెట్రో కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దిశలో 10 కిలో మీటర్ల మెట్రో సంచారాన్ని ప్రారంభించారు.

అలందూర్ , కోయం బేడు మధ్యలో సంచరించే మెట్రో రైలు చార్జీల ధర ఎక్కువగా ఉందని ప్రచారం జరగడంతో ప్రయాణికుల ఆదరణ లభించలేదు. మెట్రో రైలు ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఈ 9 నెలల కాలంలో ఓ మోస్తరుగా ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు.

Chennai Metro Rail has Black Box like Technology

మెట్రో రైలు యాజమాన్యం కొత్త అంశాల గురించి ఆలోచిస్తు ముందుకు వెలుతున్నది. చెన్నైలో పరుగులు తీస్తున్న మెట్రో రైలులో ఇటీవల బ్లాక్ బాక్స్ లు అమర్చారు. విమానంలోని బ్లాక్ బాక్స్ లాగానే ఇవి కూడా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తాయి. విమానాల్లోని డేటా రికార్డర్ అనే బ్లాక్ బాక్స్ విమానానికి సంబంధించి అన్ని వ్యవహారాలు తానంతట తానే రికార్డు చేస్తుంది.

విమానం ప్రమాదానికి గురైన సందర్బంలో బ్లాక్ బాక్స్ ను సేకరించి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తారు. ఇలాంటి బ్లాక్స్ బాక్స్ లను మెట్రో రైలులో ఏర్పాటు చేశారు. రైలులో ఎదైనా సాంకేతిక లోపం ఎర్పడినా వెంటనే విషయం గుర్తించిన ఈ బ్లాక్ బాక్స్ లు డ్రైవర్ తో పాటు కంట్రోల్ రూంకు సమాచారం అందిస్తుంది.

English summary
Each train has one Event Recorder which is connected to train control and management system (TCMS) network, says a Metro Rail spokeswoman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X