చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పౌరసత్వ సవరణ చట్టం ఎఫెక్ట్: మద్రాసు యూనివర్శిటీలోకి పోలీసులు, దెబ్బకు సెలవులు, బీజేపీ!

|
Google Oneindia TeluguNews

చెన్నై: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మద్రాసు యూనివర్శిటీ (చెన్నై)లో విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మద్రాసు యూనివర్శిటీలోకి పోలీసులు ప్రవేశించడంతో విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, యూనివర్శిటీ అధికారులు, సిబ్బందికి భద్రత కల్పించడానికి తాము యూనివర్శిటీ క్యాంపస్ లోకి వచ్చామని పోలీసులు అంటున్నారు. అయితే ఇద్దరు విద్యార్థులను బలవంతంగా పోలీసులు ఎత్తుకెళ్లారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్న యూనివర్శిటీ ఆవరణంలోని పోలీసులు ప్రవేశించడంతో మద్రాసు యూనివర్శిటీ ఆవరణం, పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!

రాత్రిపూట విద్యార్థులు

రాత్రిపూట విద్యార్థులు

పోలీసులు యూనివర్శిటీ ఆవరణంలోకి రావడంతో మద్రాసు యూనివర్శిటీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు క్యాంపస్ లోకి రావలసిన అవసరం ఏముంది ? అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. పోలీసులు జోక్యం ఎక్కువైయ్యిందని ఆరోపిస్తూ విద్యార్థులు మంగళవారం రాత్రి పూర్తిగా ఆందోళన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

మెరినా బీచ్ ఎఫెక్ట్

మెరినా బీచ్ ఎఫెక్ట్

మద్రాసు యూనివర్శిటీ విద్యార్థుల ఆందోళనతో విశ్వవిద్యాలయం అనుభంద సంస్థల కళాశాలల విద్యార్థులు ఎక్కడ మెరీనా బీచ్ లోకి వస్తారో అంటూ పోలీసులు హడలిపోతున్నారు. కాలేజ్ విద్యార్థులు మెరీనా బీచ్ లోకి రాకుండా ఉండాలంటే ముందుగా మద్రాసు యూనివర్శిటీ విద్యార్థులను కట్టడి చెయ్యాలని పోలీసులు నిర్ణయించారు. అయితే వందలాది మంది విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మద్రాసు యూనివర్శిటీ క్యాంపస్ లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు.

క్రిసమస్ సెలవుల దెబ్బ

క్రిసమస్ సెలవుల దెబ్బ

విద్యార్థుల ఆందోళనతో హడలిపోయిన అధికారులు మద్రాసు యూనివర్థిటీకి జవనరి 2వ తేది వరకు సెలవులు ప్రకటించారు. ముందుగా డిసెంబర్ 23వ తేదీ వరకు యూనివర్శిటీకి సెలవులు ప్రకటించారు. విద్యార్థుల ఆందోళన ఎక్కువ కావడంతో జనవరి 2వ తేదీ వరకు సెలవులు పొడిగించారు. డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 2వ వరకు క్రిసమస్ సెలవులు ప్రకటించామని పైకి యూనివర్శిటీ అధికారులు అంటున్నారు. అయితే మా ఆందోళనను అణిచివెయ్యడానికి అధికారులు, ప్రభుత్వం ఎత్తుగడలు వేసిందని, అందుకే జనవరి 2వ తేదీ వరకు నిరవదిక సెలవులు ప్రకటించారని పొలిటికల్ సైన్స్ పీజీ విద్యార్థి కే. రఘు ప్రశాంత్ మీడియా ముందు ఆరోపించారు.

ఆ ఉద్దేశం మాకు లేదు

ఆ ఉద్దేశం మాకు లేదు

విద్యార్థులను బలవంతంగా తాము ఇక్కడి నుంచి తరలించడానికి ఎలాంటి ప్రయత్నాలు చెయ్యడం లేదని యూనివర్శిటీ క్యాపంస్ లో మకాం వేసిన ఓ పోలీసు అధికారి అక్కడి నుంచి మీడియాకు సమాచారం ఇచ్చారు. శాంతిభద్రతలు కాపాడటం కోసమే తాము ఇక్కడికి వచ్చామని, విద్యార్థుల మీద మాకు ఎలాంటి కోపం లేదని పోలీసు అధికారులు పైకి చెబుతున్నారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ

బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ

మెరీనా బీచ్ కు ఎదురుగా మద్రాసు యూనివర్శిటీ ప్రధాన ద్వారం (మెయిన్ గేట్) దగ్గర ఆందోళన చేస్తున్న విద్యార్థులు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పౌరసత్వ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, లేదంటే మా సత్తా చూపిస్తామని విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. మొత్తం మీద మద్రాసు యూనివర్శిటీ క్యాంపస్ లో పోలీసులు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొలీసులు సైతం వారి వాహనాలను కొద్దికొద్దిగా క్యాంపస్ బయటకు తరలిస్తున్నారు.

English summary
A section of the students of the Madras University continued their protest for the second day on Tuesday against the amendment to the Citizenship Act, as police entered the campus. Defiant students said they will continue their agitation through the night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X