చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

BJP master plan: ఎంజీఆర్, సూపర్ స్టార్, వీరప్పన్, ఇళయరాజా ఫ్యామిలీకి కీలక పదవులు, అబ్బా!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో తన సత్తా చాటుకుని అధికారంలో ఉన్న బీజేపీ ఇతర రాష్ట్రాల మీద కన్ను వేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎంజీఆర్ దత్తపుత్రిక, సూపర్ స్టార్ రజనీకాంత్ వియ్యంకుడికి, నరహంతకుడు వీరప్పన్ కుమార్తె, సంగీత మాంత్రికుడు ఇళయరాజా సోదరుడితో సహ సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు కీలకపదవులు ఇచ్చింది. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాచాటు కోవాలని బీజేపీ నాయకులు ఇప్పటి నుంచే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది!Missed call lover: నేను మిస్, యువకుడికి స్వర్గం చూపించింది, ఎటూకాకుండా పోయింది!

ఎంజీఆర్, జయలలిత అంటే మాటలా!

ఎంజీఆర్, జయలలిత అంటే మాటలా!

తమిళ సినీ రంగాన్ని శాసించిన ఎంజీ. రామచంద్రన్ (ఎంజీఆర్) తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగారు. తరువాత ఏడీఎంకే ( ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ) పార్టీని స్థాపించి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ తన సత్తా చాటుకున్నారు. తమిళ తంబీల గుండెల్లో ఎంజీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎంజీఆర్ వారసురాలిగా జయలలిత తమిళనాడుకు మూడు సార్లు సీఎం అయ్యి రాజకీయంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

మాజీ సీఎం ఫ్యామిలీ

మాజీ సీఎం ఫ్యామిలీ

జయలలిత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన తరువాత ఎంజీఆర్ నమ్మకస్తులు, ఆయన అనుచరులను మాత్రమే పార్టీలోకి తీసుకున్నారు. అయితే ఎంజీఆర్ ఫ్యామిలీకి చెందిన ఎవ్వరినీ అన్నాడీఎంకే పార్టీలో చేర్చుకోలేదు. ఎంజీఆర్ దత్తపుత్రిక గీతా బీజేపీలో చేరారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ ఎంజీఆర్ దత్తపుత్రిక గీతాకు బీజేపీలో కీలకపదవి ఇచ్చారు.

వీరప్పన్ కూతురికి లక్కీచాన్స్

వీరప్పన్ కూతురికి లక్కీచాన్స్

నరహంతకుడు, గంధపు చెక్కల స్మగ్లర్ గా పేరుపొందిన వీరప్పన్ కుమార్తె విద్యారాణి కొన్ని నెలల క్రితమే బీజేపీలో చేరినా ఆమెకు ఇంత వరకు ఎలాంటి పదవి లేదు. అయితే బీజేపీ తమిళనాడు శాఖ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ ఆయన టీంలో వీరప్పన్ కుమార్తె విద్యారాణికి కీలకపదవి ఇచ్చారు. తమిళనాడు యువమోర్చ విభాగం ఉపాధ్యక్షురాలిగా విద్యారాణిని నియమించారు. వీరప్పన్ కుమార్తె విద్యారాణి వృత్తిరీత్యా న్యాయవాది (లాయర్). వీరప్పన్ వర్గాన్ని బీజేపీకి అనుకూలంగా మలుచుకోవడంలో విద్యారాణి కీలకంగా వ్యవహరిస్తోంది.

సూపర్ స్టార్ వియ్యంకుడు

సూపర్ స్టార్ వియ్యంకుడు

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ముద్దుల అల్లుడు, ప్రముఖ హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజా బీజేపీలో ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నా ఇంత వరకు ముహూర్తం కుదరలేదు. హీరో ధనుష్ తండ్రి కస్తూరి రాజాకు బీజేపీలో కీలకపదవి ఇచ్చారు.

ఇళయరాజా సోదరుడు

ఇళయరాజా సోదరుడు

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు, సంగీత దర్శకుడు, దర్శక నిర్మాత గంగై అమరన్ కు బీజేపీలో కిలకపదవి చిక్కింది. ఇక బహుబాష నటుడు, వివాదాలకు కేంద్ర బింధువు అయిన రాధారవి, నటుడు విజయ్ కుమార్, సంగీత దర్శకుడు దీనా, ప్రముఖ సినీ దర్శకుడు పెరారసు, నటుడు ఆర్ కే. సురేష్ తదితరులకు బీజేపీ సాంసృతిక విభాగంలో కీలక పదవులు చిక్కాయి. ఇప్పటికే సినీ రంగంలోని బుట్టబొమ్మ నమిత, గౌతమి, గాయిత్రీ తదితరులకు బీజేపీ తమిళనాడు శాఖలో కీలక పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం మీద బీజేపీ 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటడానికి ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది.

English summary
Sandalwood smuggler Veerappan's daughter Vidhya Rani, family of late Chief Minister MG Ramachandran and film personalities were among those appointed to Tamil Nadu BJP's state executive committee and various cells.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X