• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతో

|

అమ్మతనం, మానవత్వం సిగ్గుతో తలదించుకునేలా కామాధురాలైన ఓ తల్లి కనీవినీ ఎరుగని దారుణానికి ఒడిగట్టింది. భర్తను వదిలేసి, ప్రియుడితో సంబంధం కొనసాగిస్తోన్న ఆ మహిళ.. వాడి పైశాచిక కోరికలను తీర్చడానికి కన్నబిడ్డను పణంగా పెట్టింది. మైనర్ అనే కనికరం కూడా లేకుండా ప్రియుడితో కన్నకూతురిపైనే అత్యాచారం చేయించింది. రోజులపాటు సాగిన ఈ దారుణపర్వంలో బాలిక గర్భవతికాగా, ఆమెను బంధువుల ఇంట్లో వదిలేసి కామజంట పరారైంది. ఎట్టకేలకు వారిని పోలీసులు అరెస్టు చేశారు..

బీజేపీలోకి 30మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు -పాత ప్రొఫెషన్‌లోకి కేసీఆర్ -బండి సంజయ్ భారీ బాంబు

ప్రియుడు శేఖర్‌తో సహజీవనం

ప్రియుడు శేఖర్‌తో సహజీవనం

దక్షిణ చెన్నైలోని మదిపక్కం మహిళా పోలీస్ స్టేషన్ అధికారుల కథనం ప్రకారం.. కొన్నేళ్ల కిందటే భర్తను వదిలేసిన మహిళ(36) తన బిడ్డలతో కలిసి స్థానికంగా జీవిస్తోంది. కొన్నాళ్లుగా ఆమె.. షొలింగనల్లూర్ ప్రాంతానికి చెందిన శేఖర్ అనే పెయింటింగ్ వర్కర్ తో వివాహేతర సంబంధం నెరుపుతోంది. తరచూ శేఖర్ ఆమె ఇంటికి వచ్చివెళ్లడం, పిల్లలు ఎదుగుతున్నారన్న సోయి కూడా లేకుండా శృంగార కలాపాల్లో మునిగిపోవడం నిత్యకృత్యంగా మారింది. ఈక్రమంలోనే..

 ప్రియురాలి కూతురిపై కన్ను..

ప్రియురాలి కూతురిపై కన్ను..

శేఖర్ కన్ను తన ప్రియురాలి కూతురి(15)పై పడింది. ప్రేయసిని కలవడానికి వచ్చిన ప్రతిసారి ఆమె కళ్లుగప్పి, ఆ బాలికను లైంగికంగా వేధించేవాడు. తల్లి ఇంట్లో లేని సమయంలోనూ కొన్నిసార్లు ఇంట్లోకి వచ్చి పాపను బెదిరిస్తూ హింసించడానికి ప్రయత్నించేవాడు. వాడి ఆగడాలు భరించలేకపోయిన ఆ చిన్నారి.. తన బాధను కన్నతల్లితో చెప్పుకుంది. అయితే బిడ్డను ఓదార్చి, ప్రియుడిని గద్దించాల్సిన తల్లి కాస్తా అచ్చోసిన పశువు కంటే హీనంగా వ్యవహరించింది..

కన్నకూతురిని రేప్ చేయించి..

కన్నకూతురిని రేప్ చేయించి..

ప్రియుడు శేఖర్ కామోన్మాదాన్ని తీర్చడానికి ఏ తల్లీ చేయని విధంగా కన్నకూతురినే పణంగా పెట్టిందా మహిళ. శేఖర్ చెప్పినట్లు వినాలని, అతనేం చేసినా అడ్డుచెప్పకూడదని కూతురిని బెదరించి, బలవంతంగా బాలికపై రేప్ చేయించింది. దారుణమైన రీతిలో ఒకేసారి తల్లీకూతుళ్లను అనుభవించే అవకాశాన్ని ప్రియుడికి కల్పించింది. జుగుప్సాకరమైన ఈ ప్రక్రియ కాస్తా బాలిక గర్భానికి దారి తీసింది. దీంతో..

గర్భవతైన కూతుర్ని వదిలేసి..

గర్భవతైన కూతుర్ని వదిలేసి..

కామోన్మాదంతో తాను చేసింది ఘోరమైన తప్పిదమని గ్రహించకుండానే ఆ మహిళ.. తన ప్రియుడి ద్వారా గర్భవతి అయిన కూతురిని వదిలించుకోవాలని చూసింది. కూతురు గర్భవతి అయిందన్న విషయాన్నిదాచి పెట్టి తన సోదరుడి(బాలిక మేనమామ) ఇంట్లో వదిలేసింది. కొన్నిరోజుల తర్వాతగానీ బాలిక శరీరంలో మార్పులు, ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఏం జరిగిందని ఆరా తీయగా.. జరిగిన దారుణాన్ని మేనమామకు చెప్పుకుని రోదించిందా బాలిక. ఆ వెంటనే..

మైనర్ కూతురి ప్రసవం.. లవర్‌తో తల్లి పరార్

మైనర్ కూతురి ప్రసవం.. లవర్‌తో తల్లి పరార్

తన అక్క చేసిన దారుణంపై నిలదీయడానికి సోదరుడు ప్రయత్నించగా అప్పటికే ఆమె తన లవర్ తో పరారైపోయింది. దీంతో ఆ మేనమామ.. మైనరైన తన కోడలిపై జరిగిన అకృత్యాలపై మదిపక్కం మహిళా పోలీస్ స్టేషన్ లో గత సెప్టెంబర్ లో ఫిర్యాదు చేశాడు. అప్పటికే బాలికకు నెలలు నిండటంతో పోలీసులు ఆమెను షెల్టర్ హోంకు తరలించారు. గతేడాది అక్టోబర్ లో బాలిక ప్రసవించింది. తల్లీబిడ్డలు ఇప్పటికీ ప్రభుత్వ సంరక్షణలోనే ఉన్నారు. దారుణమైన నేరానికి పాల్పడిన ఆ తల్లి, ఆమె ప్రియుడు శేఖర్ కోసం మూడు నెలలపాటు గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు బుధవారం(డిసెంబర్ 30న) అరెస్టు చేయగలిగారు. నిందితులు ఇద్దరిపై పోక్సో సహా పలు చట్టాల కింద కేసులు పెట్టి రిమాండ్ కు తరలించారు.

క్రైస్తవ జగన్, డీజీపీ సవాంగ్ -రాక్షసం -జస్టిస్ రాకేశ్‌కు నీరాజనం -సీఎంకు భయం: ఎంపీ రఘురామ

English summary
In a shocking case of sexual abuse reported from Chennai, a 36-year-old woman allegedly let her 32-year-old boyfriend rape her 15-year-old daughter on multiple occasions. The two lovebirds were taken into custody by the Madipakkam all-women police on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X