వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి అంత్యక్రియల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి: నెటిజెన్ల మనసును గెలిచిన వ్యక్తి

|
Google Oneindia TeluguNews

మధ్యపద్రేశ్ : తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు ఆ వ్యక్తి. అయినప్పటికీ ఓటు హక్కు తన ప్రథమ హక్కు అనేది మరువలేదు. స్మశాన వాటిక నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటుహక్కును వినియోగించుకున్నాడు.

అది మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి సోమవారం పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు విధిగా వారి ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. అక్కడికి ఓ వ్యక్తి తడి బట్టలు అప్పుడే కేశఖండన చేయించుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ఇక అసలు విషయం ఏమిటంటే ఆ వ్యక్తి తండ్రి మృతి చెందాడు. స్మశాన వాటికలో తన తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకుని నేరుగా పోలింగ్ కేంద్రానికి వచ్చాడు. ఆఫోటోలు సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి. పుట్టెడు బాధలో ఉన్నప్పటికీ ఆ వ్యక్తి మాత్రం తన కర్తవ్యాన్ని మరిచిపోలేదు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజెన్లు పాజిటివ్ కామెంట్స్ రాశారు. ప్రజాస్వామ్యానికి వాస్తవ ముఖచిత్రం అని ఒకరు కామెంట్ రాశారు.

Chhatarpur man votes after fathers last rites,wins netizens hearts

ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాలకు గాను ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే నాల్గవ విడతలో ఆరు స్థానాలకు పోలింగ్ జరుగగా మిగతా 16 స్థానాలకు మే 12, మే 19న జరగనుంది. ఇక మధ్యప్రదేశ్‌తో పాటు బీహార్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతోంది. హజీరాబాగ్‌ నియోజకవర్గంలో వందేళ్లకు పైబడిన మహిళ పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకుంది.

English summary
His shoulders draped in white cloth, the man stood behind the screen emblazoned with the Election Commission's logo.He had come to vote after his father's last rites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X