వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవాగ్జిన్ సప్లైని నిలిపివేయండి... వ్యాక్సిన్‌పై అనుమానాలు.. కేంద్రాన్ని కోరిన ఛత్తీస్‌గఢ్...

|
Google Oneindia TeluguNews

తమ రాష్ట్రానికి భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ సప్లైని నిలిపివేయాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరడం చర్చనీయాంశంగా మారింది. కోవాగ్జిన్‌పై పలు అనుమానాలు లేవనెత్తిన ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం... వాటిని నివృత్తిని చేసేంతవరకూ వ్యాక్సిన్ సప్లైని నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ డియో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌కు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు.

కోవాగ్జిన్‌పై ఛత్తీస్‌గఢ్ ఆందోళన...


కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తి కాకపోవడం... వ్యాక్సిన్ వయల్స్‌పై గడువు తేదీని కూడా పేర్కొనకపోవడంపై టీఎస్ సింగ్ డియో ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ మంత్రి లేఖపై స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఆయన లేవనెత్తిన సందేహాలను కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కోవీషీల్డ్,భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పూర్తిగా సురక్షితం,ఇమ్యునోజెనిక్ అని తెలిపారు. వ్యాక్సిన్‌పై ఎటువంటి తేదీ లేదని పేర్కొనడం పూర్తిగా నిరాధారమని ఆయన పేర్కొన్నారు. మ్యానుఫాక్చరింగ్ తేదీతో కూడిన కోవాగ్జిన్‌ వయల్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

కేంద్రమంత్రి రిప్లై...

కేంద్రమంత్రి రిప్లై...


దేశంలో నెలకొన్న కోవిడ్-19 పరిస్థితులను ఎదుర్కొనడానికి అత్యవసర పరిస్థితుల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీసీఓ) ప్రీ-క్లినికల్,క్లినికల్ ట్రయల్ డేటాను పరిశీలించిన తర్వాతే.. కోవీషీల్డ్,కోవాగ్జిన్ తయారీకి అనుమతినిచ్చిందని హర్షవర్దన్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడతలో భాగంగా మొత్తం 2,09,512 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు గాను కేవలం 9.55శాతం మందికే వ్యాక్సిన్ ఇచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రానికి అవసరమైన మేర వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో ఉందని... కాబట్టి వ్యాక్సిన్ కవరేజీని మెరుగుపరిచే చర్యలు తీసుకోవాలని సూచించారు.

తొలినుంచి అనుమానాలే...

తొలినుంచి అనుమానాలే...

కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌పై మొదటినుంచి చాలా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా(ఆర్‌ఎంఎల్‌) ఆసుపత్రి రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌(ఆర్‌డీఏ) వైద్యులు కూడా తమకు కోవాగ్జిన్ వద్దని తేల్చి చెప్పారు. కోవాగ్జిన్‌ పట్ల తమ వైద్యుల్లో కొన్ని సందేహాలు, స్వల్పంగా భయాందోళనలు ఉన్నాయని.. కాబట్టి తమకు కోవీషీల్డ్ మాత్రమే ఇవ్వాలని కోరారు. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా కోవాగ్జిన్ సమర్థతపై ఇప్పటికే పలు అనుమానాలు,సందేహాలు వ్యక్తం చేసింది.

English summary
As Chhattisgarh Health Minister TS Singh Deo expressed doubts over the safety of Covaxin over the Bharat Biotech vaccine not completing Phase 3 trials yet, Union Health Minister Harsh Vardhan slammed the Congress leader saying it is not befitting of a state minister to cast doubts and serve vested interests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X