వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్ గఢ్ లో తుది పోరు.. 72 స్థానాలకు 1101 అభ్యర్థులు.. విజయంపై పార్టీల ధీమా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chhattisgarh Assembly Elections 2018 : 72 స్థానాలకు 1101 అభ్యర్థులు.. విజయంపై పార్టీల ధీమా| Oneindia

ఛత్తీస్ గఢ్ : అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారం మలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలవరకు కొనసాగనుంది. ఎన్నికల అధికారులు అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. లక్షకు పైచిలుకు సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 72 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1101 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. బిలాస్ పూర్ డివిజన్ లోని 24 స్థానాలు, సర్గుజా డివిజన్ లోని 14 స్థానాలు, దుర్గ్ డివిజన్ లోని 14 , రాయ్ పూర్ డివిజన్ లోని 20 స్థానాలకు మలిదశ పోలింగ్ జరుగుతోంది.

ఒక్కదానికి 15 మంది పోటీ

ఒక్కదానికి 15 మంది పోటీ

కాంగ్రెస్, బీజేపీ, అజిత్ జోగి పార్టీ (జేసీసీ) అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు పెద్ద సంఖ్యలో బరిలో నిలిచారు. అయితే రాయ్ పూర్ వెస్ట్ నుంచి అత్యధికంగా 46 మంటి పోటీ పడుతుండటం విశేషం. మంగళవారం జరుగుతున్న రెండో దశ పోలింగ్ కు సంబంధించి 72 స్థానాలకు గాను 46 జనరల్ స్థానాలు, 17 ఎస్టీ స్థానాలు, 9 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఈ 72 స్థానాలకు సంబంధించి 27 చోట్ల కాంగ్రెస్, 43 చోట్ల బీజేపీ, ఒకచోట బీఎస్పీ, మరోచోట ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం 72 నియోజకవర్గాల్లో 1101 మంది పోటీపడుతుండటంతో సగటున 15మంది బరిలో నిలిచినట్లైంది.

మొత్తం 90 స్థానాలకు గాను నక్సల్స్ ప్రాబల్యమున్న 18 చోట్ల ఈనెల 12న తొలిదశ పోలింగ్ జరిగింది. 190 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బస్తర్ డివిజన్ లోని 12 స్థానాలకు, దుర్గ్ లోని 6 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు దశల పోలింగ్ కు సంబంధించిన ఫలితాలు మాత్రం వచ్చే నెల 11న వెలువడుతాయి.

 పోటాపోటీ.. బరిలో ప్రముఖులు

పోటాపోటీ.. బరిలో ప్రముఖులు


మర్వాహి నియోజకవర్గం నుంచి జేసీసీ అధినేత అజిత్ జోగి పోటీ చేస్తుండగా, కోట నుంచి ఆయన సతీమణి ఎన్నికల బరిలో నిలిచారు. ఆయన కోడలు రిచా బీఎస్పీ తరపున అకల్ తారా స్థానం నుంచి పోటీ పడుతున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ భూపేష్ బగల్ తో పాటు కాంగ్రెస్ సీఎంగా రేసులో ఉన్న చరణ్ దాస్ మహంత్ తో పాటు తొమ్మిది మంత్రులు అసెంబ్లీ బరిలో నిలిచారు.

 మేమే గెలుస్తాం.. పార్టీల ధీమా

మేమే గెలుస్తాం.. పార్టీల ధీమా


అభివృద్ధిపై ఆశలు పెట్టుకున్న బీజేపీ నేతలు తమదే విజయంగా చెప్పుకుంటున్నారు. అంతేగాకుండా మోడీ హవా కలిసొస్తుందని భావిస్తున్నారు. అటు కాంగ్రెస్ లీడర్లు కూడా ఛత్తీస్ గఢ్ పీఠం మాదేనంటున్నారు. మరోవైపు జేసీసీ - బీఎస్పీ కూటమి హంగ్ పై ఆశలు పెట్టుకుంది.

English summary
chattisgarh second phase elections started, 1101 candidates contesting in 72 constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X