వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చత్తీస్‌ గఢ్ భారీ ఎన్‌కౌంటర్ తర్వాత అక్కడి పరిస్థితి ఎలా ఉందో తెలుసా..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

బస్తర్ : చత్తీస్‌ గఢ్ లో మరోసారి తుపాకుల మోత మోగింది. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బస్తర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. జగదల్‌పూర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురిని మట్టుబెట్టారు. అందులో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వారి నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సహ జీవనంలో మరొకడు ఎంట్రీ.. ఆమెకు దగ్గరయ్యాడని హత్య..!సహ జీవనంలో మరొకడు ఎంట్రీ.. ఆమెకు దగ్గరయ్యాడని హత్య..!

మరణించినవారిలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు అనుమానిస్తున్నాయి భద్రతా దళాలు. కొన్నిరోజులుగా ఇక్కడి అటవీప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించిన భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించినట్టు సమాచారం. తిరియా గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు తెలిపారు.

 chhattisgarh encounter after visuals video

జిల్లా రిజర్వ్‌ గార్డ్‌, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్​లో పాల్గొన్నాయి. స్పాట్ నుంచి ఒక ఐఎన్​ఎస్​ఏఎస్​ రైఫిల్​, నాలుగు 303 రైఫిల్స్​ సహా పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పక్కా సమాచారంతోనే భద్రతా బలగాలు అటాక్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా మావోయిస్టులు వేసుకున్న గుడారానికి చేరుకుని ఎదురుకాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఎన్‌కౌంటర్ తర్వాత అక్కడి దృశ్యాలు భయానకంగా మారాయి. దానికి సంబంధించిన విజువల్స్ ఈ వీడియోలో ఉన్నాయి.

English summary
Big Encounter took place in chattisgarh bastar district. Seven mavoists including three women died in encounter. After Encounter the situation is very teriffic in spot, that video came out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X