వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలుగురు మహిళా మావోయిస్టుల హతం

By Pratap
|
Google Oneindia TeluguNews

రాయపూర్: చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా నాగలిగూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళా మావోయిస్టులు మరణించారు.

మావోయిస్టులు సమావేశమయినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందండంతో సుమారు 500 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బంది మూడు జట్లుగా చీలిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఆపరేషన్‌ జరిపి తిరిగి వస్తున్న నేపథ్యంలో మొదటి దళంపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో వెనుకవైపు నుంచి వస్తున్న రెండో దళం మావోయిస్టులపై కాల్పులు జరిపారు.

Chhattisgarh: Forces destroy Maoist camp, kill four rebels in Bastar

ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. వారి వద్ద ఉన్న విప్లవ సాహిత్యం, నాలుగు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద చత్తీస్‌గఢ్‌లో వరుసగా వారం రోజుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. అందులో ఐదుగురు మహిళా మావోయిస్టులు చనిపోవడం విశేషం.

ఈ ఎన్‌కౌంటర్ ఆదివారం తెల్లవారు జామున జరిగింది. మావోయిస్టుల శిబిరాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. నలుగురు మహిళా మావోయిస్టులు మరణించగా, మిగతా వారు అడవిలోకి పారిపోయినట్లు దంతెవాడ ఎస్పీ చెప్పారు.

English summary
Four women Maoists were killed in an encounter with security forces at Nagalgunda hills in south Chhattisgarh on Sunday. A camp of the outlawed left-wing extremists was also demolished.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X