వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఫ్రీగా 55లక్షల స్మార్ట్ ఫోన్స్ అందిస్తోంది!

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 55 లక్షల స్మార్ట్‌ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 55 లక్షల స్మార్ట్‌ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి 'సంచార్‌ కాంత్రి యోజన' అని పేరు పెట్టారు.

రెండేళ్లలో రెండు దశల కింద ఈ పథకాన్ని అమలు చేస్తారు. తొలుత వేయికిపైగా జనాభా ఉన్న గ్రామాలు, పట్టణ పేదలు, కళాశాల విద్యార్థులకు 50.8 లక్షల ఫోన్లు అందజేస్తారు.

Chhattisgarh govt to distribute 5.5 mn smartphones for free

రెండో దశలో 4.8 లక్షల ఫోన్లను 1000 కన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామాల వారికి ఇస్తామని పరిశ్రమ శాఖ మంత్రి అమర్‌ అగర్వాల్‌ తెలిపారు. ఇంట్లోని మహిళల పేరు మీదనే వీటిని ఇస్తారు.

అంతేగాక, వీటిని ఆధార్‌, బ్యాంక్‌ ఖాతాలతో అనుసంధానం చేస్తారు. ప్రభుత్వ భవనాలపై ఉచితంగా మొబైల్‌ టవర్లు పెట్టుకునేందుకు టెలికాం కంపెనీలకు అనుమతి ఇస్తారు.

English summary
To reduce the digital divide, the Chhattisgarh government has decided to distribute around 5.5 million smartphones for free under the Sanchar Kranti Yojana (SKY).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X