వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయాపై అమానుషం.. కిందపడేసి, ఈడ్చుకెళ్లి.. సూపరింటెండెంట్ భర్త అరాచకం..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆయాపై అమానుషం.. కిందపడేసి, ఈడ్చుకెళ్లి.. సూపరింటెండెంట్ భర్త అరాచకం..! (వీడియో)

రాయ్‌పూర్ : ప్రభుత్వ వసతి గృహం సూపరింటెండెంట్ భర్త రెచ్చిపోయారు. అక్కడ పనిచేస్తున్న ఆయాపై అమానుషంగా ప్రవర్తించారు. మూడు నెలల బాలింత అని కూడా చూడకుండా ఆమెపై దారుణంగా ప్రవర్తించారు. చత్తీస్ గఢ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దారుణం బయటి ప్రపంచానికి తెలిసింది.

చత్తీస్ గఢ్ కొరియా జిల్లా జనక్‌పూర్ బ్లాక్‌లో బర్వాని కన్యా పేరుతో ప్రభుత్వ వసతి గృహం ఉంది . అక్కడ సుమీలా సింగ్ అనే మహిళ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడే ఆయాగా పనిచేస్తున్న ఓ మహిళను అత్యంత దారుణంగా బయటకు నెట్టేశారు. మూడు నెలల పసిబిడ్డతో ప్రభుత్వ వసతి గృహంలో ఆయాగా విధులు నిర్వహిస్తూ అక్కడే ఉంటున్న సదరు ఆయాపై సూపరింటెండెంట్ భర్త రంగ్‌లాల్ సింగ్ చేయి చేసుకున్నాడు. మంచం మీద పడుకున్న ఆమెను బలవంతంగా కిందకు నెట్టేయడమే గాకుండా ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్లారు. ఆమెకు సంబంధించిన వస్తువులన్నీ విసిరికొట్టారు.

Chhattisgarh govt hostel superintendent Husband Dragging A Woman

మూడు నెలల బాలింత అని కూడా ఆమెపై కనికరం చూపలేదు ఆ భార్యాభర్తలు. వసతి గ‌ృహంలో నీవు ఎలా ఉంటావంటూ ఆమెను గద్దించడమే గాకుండా నానా మాటలు అన్నారు. అక్కడినుంచి వెళ్లిపోవాలని వారు కోరడంతో ఆమె నిరాకరించింది. అక్కడే ఉంటానని స్పష్టం చేసింది. ఆ క్రమంలో సూపరింటెండెంట్ భర్త రంగ్‌లాల్ సింగ్ ఆయాతో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లి బయటకు తోసేశారు. ఇదంతా జరుగుతుంటే భర్తకు సాయం చేశారు సదరు సూపరింటెండెంట్.

<strong>మైనార్టీలకు ఇక పెద్ద దిక్కు బండి సంజయేనా.. ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీకి చెక్..?</strong>మైనార్టీలకు ఇక పెద్ద దిక్కు బండి సంజయేనా.. ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీకి చెక్..?

సాటి మహిళ అని చూడకుండా, మూడు నెలల బాలింత అనే కనికరం లేకుండా సదరు మహిళ సూపరింటెండెంట్ వ్యవహరించిన తీరు వివాదస్పదమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దాంతో ఆ భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

English summary
Ranglal Singh, husband of School Superintendent Sumila Singh misbehaved with a cleaner at Barwani Kanya Ashram in Korea, after she took shelter at students hostel with her 3 month old baby. Police says, FIR filed. Probe on Accused will be arrested soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X