వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ సీడీ వ్యవహారం.. ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్‌ చీఫ్ పేరు, మంత్రి ఒత్తిడిమేరకేనా?

ఛత్తీస్‌గఢ్‌ మంత్రి రాజేష్ మునత్ సెక్స్ సీడీ ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ భూపేష్‌ బాఘెల్‌ పేరును కూడా రాయ్‌పూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ మంత్రి రాజేష్ మునత్ సెక్స్ సీడీ ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కాంగ్రెస్‌ చీఫ్‌ భూపేష్‌ బాఘెల్‌ పేరును కూడా రాయ్‌పూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ లో చేర్చారు.

మంత్రి రాజేష్‌ మునత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన పేరును జత చేర్చినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న పాత్రికేయుడు వినోద్‌ వర్మను శుక్రవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Chhattisgarh minister 'sex CD' case: FIR lodged against Congress leader Bhupesh Baghel, scribe Vinod Verma

అరెస్ట్ సమయంలో తన దగ్గరుంది మంత్రి రాజేష్‌ మునత్‌ వ్యక్తిగత వీడియో అని వినోద్ మీడియాకు వెల్లడించాడు. అది నచ్చకే ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్య చేపట్టిందని కూడా పేర్కొన్నాడు.

అయితే మంత్రి రాజేష్‌ మునత్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. సీడీ వ్యవహారం ఫేక్‌ అని.. కావాలంటే విచారణ జరిపించాలని... ప్రకటించారు. మరోవైపు మీడియా హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని.. మంత్రిని రక్షించేందుకు యత్నిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించగా.. బీజేపీ మాత్రం వాటిని ఖండించింది.
పాత్రికేయుడు వినోద్ వర్మ అరెస్ట్ తర్వాత ఆయన ఇంట్లోంచి సుమారు 500 సీడీలను, పెన్‌ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అందులో ఏముందన్న విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించటం లేదు.

English summary
Following the arrest of senior journalist Vinod Verma on Friday over extortion charges, the Chhattisgarh police today lodged an FIR against president of state Congress Committee Bhupesh Baghel as well as Verma in connection with the state minister sex CD case. The FIR was registered under relevant sections of IT act, news agency ANI reported. Verma, a former BBC and Amar Ujala journalist, yesterday said that he had a "sex CD of a Chattisgarh minister" and that his arrest over blackmailing and extortion charges was a "political vendetta". "I have a sex CD of Chhattisgarh Minister Rajesh Munat and that is why the state government is not happy with me," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X