• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తొలిసారి బస్తర్ అడవుల్లోకి అమిత్ షా -ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్ స్థలి వద్ద జవాన్లకు నివాళి -హైఅలర్ట్

|

ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో భద్రతా బలగాలపై మావోయిస్టులు జరిపిన భీకరదాడితో దేశమంతా నివ్వెరపోయింది. సుక్మా-బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని టెర్రాం(బీజాపూర్ జిల్లా) వద్ద శనివారం మావోయిస్టులు అత్యంత వ్యూహాత్మకంగా జరిపిన దాడుల్లో 24 మంది జ‌వాన్లు నేల‌కొరిగారు. ఈ ఘటనతో కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. ప్రతీకారం తప్పదంటూ నక్సల్స్ ను హెచ్చరించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు..

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలుతల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. టెర్రాం వద్ద జ‌వాన్ల‌పై దాడి జ‌రిగిన ప్రాంతాన్ని ఆయన ప‌రిశీలించనున్నారు. ఆ స్థలంలోనే అమరులకు నివాళులు అర్పించనున్నారు. స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న జ‌వాన్ల‌ను కూడా కేంద్ర మంత్రి పరామర్శిస్తారు. అనంతరం వివిధ భద్రతా బలగాల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు.

Chhattisgarh Naxal attack: Amit Shah to pay tributes at encounter site, first visit to the Bastar region

నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లలో ఫ్రంట్ లైన్లో ఉంటోన్న సీఆర్పీఎఫ్, ఇతర కేంద్ర బలగాలు హోం శాఖ పరిధిలోకే వస్తాయని తెలిసిందే. కాగా, కేంద్ర హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమిత్ షా బస్తర్ అడవులకు రావడం ఇదే మొదటిసారి. గత లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడి హోదాలో మాత్రమే షా ఇక్కడి మైదాన ప్రాంతాలకు వచ్చారు. ఇప్పుడు ఏకంగా..

పవన్ మెడకు పులివెందుల ఉచ్చు -జగన్ ఇలాకాలో జనసేనానిపై పోలీసులకు ఫిర్యాదు -మున్సిపల్ కార్యవర్గం ఫైర్పవన్ మెడకు పులివెందుల ఉచ్చు -జగన్ ఇలాకాలో జనసేనానిపై పోలీసులకు ఫిర్యాదు -మున్సిపల్ కార్యవర్గం ఫైర్

బస్తర్ రీజియన్ లోకి వచ్చే బీజాపూర్ లో మారుమూల అడవిలోనికి కేంద్ర మంత్రి అమిత్ షా వెళుతుండటం ఇదే తొలిసారి. జవాన్లలో ఆత్మస్థైర్యం నింపేందుకే ఆయనీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా రాక సందర్బంగా బస్తర్ అడవుల్లో కనీవినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా సిబ్బందిపై దాడికి కారణమైన వారికి సరైన సమయంలో సరైన జవాబు చెబుతామని ఆదివారం ఢిల్లీలో ప్రకటించిన ఆయన.. ఇప్పుడు దండకార్యన్యానికే వస్తుండటం గమనార్హం.

English summary
Union Home Minister Amit Shah flew to Chhattisgarh on Monday, two days after 22 security personnel were killed in an ambush by the Maoists in south Bastar’s Tarrem. One Central Reserve Police Force (CRPF) commando is still missing. During his day-long visit, Mr. Shah is expected to visit Jagdalpur where he will attend the wreath-laying ceremony for those killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X