వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఆయూష్మాన్ భారత్’తో ఆరోగ్యభద్రత: మోడీ, ‘ఆ ప్రాంతంలో పర్యటించిన తొలి ప్రధాని’

|
Google Oneindia TeluguNews

బీజాపూర్: 2018 బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఆవిష్కరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఏర్పాటు చేసిన తొలి ఆరోగ్య కేంద్రాన్ని మోడీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఈరోజు భారతదేశంలోని వందకోట్లకుపైగా ఉన్న ప్రజలకు ముఖ్యమైనదని అన్నారు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని చెప్పారు. మోడీ దేశానికి ఎంతో సేవ చేశారని, ఆయన వల్లే దేశాభివృద్ధి జరుగుతోంది అన్నారు. ఈ దేశానికి ఒక ప్రధాని ఉన్నాడంటే ఆయన చలవేనని అన్నారు.

Chhattisgarh: PM Modi launches ‘Ayushman Bharat’, credits Ambedkar for Indias growth

బీజాపూర్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇక బీజాపూర్ వెనుకబడిన ప్రాంతంగా ఉండబోదని అన్నారు. సమాజంలోని ప్రజల కలలను సాకారం చేసేందుకే తమ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆయూష్మాన్ భారత్ అనే కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నూతన మార్పులను తీసుకొస్తుందని చెప్పారు. 1.5లక్షల ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య భద్రత కల్పించడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతోపాటు ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలో బస్తర్‌ ఇంటర్నెట్‌ పథకం కింద 40వేల కిలోమీటర్ల పొడవైన ఫైబర్‌ ఆప్టిక్స్‌ నెట్‌వర్క్‌ మొదటి దశను మోడీ ప్రారంభించారు.

ఈ నెట్‌వర్క్‌ను రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు చెందిన ఏడు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. బీజాపూర్‌లో కొత్త రైలు మార్గాన్ని కూడా ప్రారంభించారు. మోడీ ఏడు గ్రామాలలో బ్యాంకు శాఖలను కూడా ప్రారంభించారు. అలాగే రూ.1700కోట్ల విలువైన రోడ్డు, వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. కాగా, బీజాపూర్‌లోని గిరిజన ప్రాంతాలను సందర్శించిన తొలి ప్రధాని నరేంద్ర మోడీనే కావడం గమనార్హం.

కాగా, ఆయుష్మాన్‌ భారత్‌ కింద దేశవ్యాప్తంగా 2022 సంవత్సరం నాటికి 1.5లక్షల ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌తో పాటు వృద్ధాప్యం వల్ల వచ్చే పలు సమస్యలకు చికిత్స అందించేందుకు తగిన వసతులతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఈ పథకం ద్వారా బీమా సౌకర్యం కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

English summary
Prime Minister Narendra Modi inaugurated the first health centre under Ayushman Bharat Scheme here today. He also inaugurated the first phase of the Bastar Internet scheme under which a 40,000-km-long network of fibre optics cable would be spread across the seven districts of the tribal region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X