వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12.30 గంటలకు 25శాతం.. ఛత్తీస్ గఢ్ లో కొనసాగుతున్న పోలింగ్

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మలిదశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు 25 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. 72 స్థానాలకు గాను దాదాపు పదకొండు వందల మంది పోటీపడుతున్నారు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. పది గంటల వరకు 12.54 శాతం నమోదైన ఓటింగ్ మధ్యాహ్నం 12.30 కల్లా 25 శాతానికి పెరిగింది.

రెండో దశ పోలింగ్ లో భాగంగా మంగళవారం కొనసాగుతున్న 72 స్థానాలకు 1079 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 19మంది మహిళా నేతలున్నారు. రాయ్ పూర్ సౌత్ నుంచి అత్యధికంగా 46 మంది పోటీ చేస్తుంటే.. బింద్రానవ్ గఢ్ స్థానంలో అతి తక్కువగా ఆరుగురు అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

chhattisgarh polling updates

మావోయిస్టు దాడులు జరిగే ఛాన్సుందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు లక్షకు పైచిలుకు సెక్యూరిటీ సేవలు అందిస్తున్నారు. డ్రోన్లు, చాపర్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అదలావుంటే తమ గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవంటూ పరేవపలి గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

English summary
chhattisgarh polling 25 percent upto afternoon 12.30pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X