వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషయం తెలిసినా...: భర్త మృతినే బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన న్యూస్ యాంకర్

చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ టీవీ యాంకర్ లైవ్ న్యూస్‌లో తన భర్త మృతి వార్తను బ్రేకింగ్‌గా చదవాల్సిన పరిస్థితి వచ్చింది. వృత్తి ధర్మంలో భాగంగా ఆమె ఆ తాజా వార్తను గుండె నిబ్బరంతో చదివారు.

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ టీవీ యాంకర్ లైవ్ న్యూస్‌లో తన భర్త మృతి వార్తను బ్రేకింగ్‌గా చదవాల్సిన పరిస్థితి వచ్చింది. వృత్తి ధర్మంలో భాగంగా ఆమె ఆ తాజా వార్తను గుండె నిబ్బరంతో చదివారు.

తన జీవిత భాగస్వామి మృతి చెందారని తెలిసి, ఆ బాధను దిగమింగుకొని ఆమె తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించింది. ఉద్యోగం పట్ల నిబద్ధతను ప్రదర్శించిన ఆమె పేరు సుప్రీత్‌ కౌర్‌. ఆమె మనోనిబ్బరాన్ని చూసిన తోటి ఉద్యోగుల‌కు నోటమాట రాలేదు.

తన భర్త మరణవార్తను స్వయంగా తానే లైవ్‌ న్యూస్‌లో బ్రేకింగ్‌ న్యూస్‌గా చదవడంతో అక్కడ ఉన్నవారంతా చలించిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది.

సుప్రీత్‌ కౌర్‌ (28) గత తొమ్మిదేళ్లుగా ఆ టీవీ ఛానెల్‌లో న్యూస్‌ రీడ‌ర్‌గా పని చేస్తున్నారు. ఆమెకు హర్సద్‌ కవాడేతో గతేడాది పెళ్లయింది. వీరిద్దరూ రాయ్‌పూర్‌లోనే ఉంటున్నారు. రోజువారీ న్యూస్‌ బులెటిన్‌లో భాగంగా ఆమె ఈ శనివారం ఉదయం కూడా వార్తలు చదువుతున్నారు.

పితార ప్రాంతంలో ఓ రెనాల్ట్‌ డస్టర్‌ కారు ప్రమాదానికి గురైందని అందులో అయిదుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురు మృత్యువాతపడ్డారని రిపోర్టర్‌ ఫోన్‌ ద్వారా వివరాలు వెల్లడించారు. ఆమెకు అప్పుడే అర్థమైంది ఆ కారు తమదేనని, చనిపోయిన వారిలో తన భర్త ఉన్నాడని.

chhattisgarh tv anchor

ఆమె ఆ బాధను దిగమింగుకొని బులెటెన్‌ ముగించి బయటకు వచ్చారు. వార్త తెలిసిన వెంటనే ఆమె బయటకు వెళ్లిపోతుందని అంతా భావించినప్పటికీ, పనిపట్ల ఆమెకు ఉన్న నిబద్ధతకు వాళ్ల నోట మాటలు రానీయలేదు.

మహసముండ్‌ జిల్లాలోని పితారా వద్ద రెనో డస్టర్‌ వాహనం ఈ ఉదయం ఘోర ప్రమాదానికి గురైందని, వాహనంలో ప్రయాణిస్తున్న అయిదుగురిలో ముగ్గురు మృత్యువాత పడినట్టు ఆ రిపోర్టర్‌ వివరించారని తోటి ఉద్యోగులు పేర్కొన్నారు.

అప్పుడే ఆమెకు తన భర్త కూడా అదే మార్గంలో నలుగురితో వెళ్లిన సంఘటన గుర్తుకు వచ్చిందని, కానీ వెంటనే అక్కడినుంచి వెళ్లిపోలేదని, తన న్యూస్‌ బులెటిన్‌ అయిన తర్వాతనే బయటకు వచ్చిందని, నిజంగా ఆమె ధైర్యశాలి అని, ఆమెతో క‌లిసి ప‌ని చేస్తునందుకు మేం గర్విస్తున్నామని, కానీ ఆమె జీవితంలో జరిగిన ఈ దుర్ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని టి ఉద్యోగులు అంటున్నారు.

పక్కకు వచ్చి విలపించారు

సుప్రీత్ కౌర్ బుల్లెటిన్ అయిపోయాక పక్కకు వచ్చి విలపించారు. ఆ తర్వాత తేరుకొని బంధువులకు సమాచారం అందించి, ప్రమాద స్థలికి వెళ్లారు. భిలాయ్‌ వాసి అయిన కౌర్ ఏడాది కిందటే హర్షద్ కవాడేను పెళ్లి చేసుకున్నారు.

కెమెరా లైట్లు ఆర్పివేశాకే ఆమె బోరుమన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టీవీ కెమెరాలు ఆపివేసే వరకు ప్రొఫెషనలిజంతో వ్యవహరించిన సుప్రీత్ కౌర్ తర్వాతే తన బంధువులను తల్చుకుంటూ బోరుమని ఏడ్చేశారన్నారు.

తొమ్మిదేళ్లుగా ఈ చానెల్‌లో పనిచేస్తున్న సుప్రీత్ కౌర్.. ఛత్తీస్‌గఢ్‌లోని ప్రముఖ న్యూస్ యాంకర్లలో ఒకరు. సుప్రీత్ కౌర్‌కు ఒక కూతురు కూడా ఉన్నారని, తీరని కష్టాల్లో చిక్కుకున్న తమ ఉద్యోగికి పూర్తిగా అండగా నిలుస్తామని చానెల్ ఎడిటర్ తెలిపారు.

శనివారం ఉదయం కౌర్ భర్త, మరో నలుగురితో పాటు రెనాల్ట్ డస్టర్‌ కారులో రాయ్‌పూర్ నుంచి సరాయ్‌పాలి వెళుతుండగా మార్గమధ్యంలో పిథోరా వద్ద వారి వాహనం ట్రక్కుని ఢీ కొన్నదని, ఈ ప్రమాదంలో కౌర్ భర్త కూడా మరణించినట్టు తమకు తెలిసినా ఆమెకు చెప్పలేకపోయామని.. ధైర్యం చాలలేదని ఎడిటర్ చెప్పారు. ఆ విషయం గ్రహించి కూడా కౌర్ గుండెనిబ్బరం చేసుకుని బులెటిన్ పూర్తిచేశారన్నారు.

English summary
Her job is to read news on TV and Supreet Kaur did just that by reading the breaking news of her husband’s death in a road accident, leaving her shell-shocked colleagues speechless by her exemplary commitment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X