వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్ర అసెంబ్లీ బరిలో చోటా రాజన్ సోదరుడు.. ఆర్పీఐ నుంచి పోటీ, ఏ స్థానమో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర ఎన్నికల బరిలో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తొలిసారిగా థాక్రే కుటుంబం నుంచి బరిలోకి దిగిన ఆదిత్య థాక్రే.. హౌ ఆర్ యూ వర్లీ పేరుతో పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎన్డీఏ భాగస్వామి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మాఫియా డాన్ చోటా రాజన్ సోదరుడికి టికెట్ ఇచ్చి తన పార్టీ విధానమెంటో చాటుకుంది.

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌కు 8ఏళ్లు జైలుశిక్ష విధించిన ముంబై కోర్టు'

మహా పోరు

మహా పోరు

మరో 19 రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే బీజేపీ-శివసేన భాగస్వామ్య పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకొంది. తమకు కేటాయించిన సీట్లలో ఒక స్థానాన్ని మాఫియా డాన్ చోటా రాజన్ సోదరుడికి కట్టబెట్టి సంచలనం సృష్టించింది. దీనిపై రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చోటా రాజన్ సోదరుడు

చోటా రాజన్ సోదరుడు

బీజేపీ-శివసేన, ఆర్టీపీ పార్టీకి ఆరు స్థానాలు కట్టబెట్టింది. ఇందులో సాతారా జిల్లాలోని ఫాల్టాన్ ఒకటి. ఇక్కడి నుంచి చోటా రాజాన్ సోదరుడు దీపక్ నికల్జే పేరును ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలే ప్రకటించారు. దీపక్‌తోపాటు మరో ఐదుగురి అభ్యర్థుల పేర్లను కూడా అథవాలే మీడియాకు విడుదల చేశారు.

ఆరు సీట్లలో ఒకటి

ఆరు సీట్లలో ఒకటి

ఆర్పీపీ సాతారాలోని ఫాల్టాన్, సోలాపూర్‌లోని మల్షిరాస్, నాందేడ్‌లోని భాండారా, నైగోన్, ఫర్బాణిలోని పత్రి, ముంబై నగరంలోని మకుర్ద్, శివాజీనగర్ నుంచి అభ్యర్థులను పార్టీ చీఫ్ రాందాస్ అథవాలే ప్రకటించారు. అయితే చోటారాజన్ సోదరుడు దీపక్ గతంలో కూడా చెంబూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ గెలవలేక ఓడిపోయారు. కానీ ఈసారి పొత్తులో భాగంగా చోటారాజన్ స్వస్థలం పాల్టాన్ నుంచి ఆర్పీపీకి సీటు దక్కింది. దీంతో అక్కడినుంచి దీపక్‌ను రాందాస్ అథవాలే బరిలోకి దింపారు.

English summary
union minister Ramdas Athawale's Republican Party of India (RPI), fielded Don Chhota Rajan's brother as a party candidate in the upcoming Maharashtra election. Deepak Nikalje will contest Phaltan assembly constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X