వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌కు 8ఏళ్లు జైలుశిక్ష విధించిన ముంబై కోర్టు

|
Google Oneindia TeluguNews

ముంబై: 2012లో హత్యాయత్నం ఆపై దోపిడి చేశారంటూ ఓ ప్రముఖ హోటల్ యజమాని అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్‌ మరో నలుగురు అనుచరులపై కేసు నమోదు చేశారు. ఆ కేసును విచారణ చేసిన ముంబై కోర్టు చోటారాజన్‌కు అతని అనుచరులకు ఎనిమిదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అంతకుముందు వారిని ఆయుధాల చట్టం కింద వారిని నేరస్తులుగా ప్రకటించిన కోర్టు మధ్యాహ్నం వారికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. శిక్షతో పాటు రూ.5 లక్షలు జరిమానా కట్టాలని చోటారాజన్‌ను ఆదేశించింది.

అంతకుముందు ప్రత్యేక కోర్టు జడ్జీ జస్టిస్ ఊటీ వాంఖాడే మోకా చట్టం కింద చోటారాజన్‌తో పాటు మరో ఐదుమందిని నేరస్తులుగా ప్రకటించారు. బీఆర్ షెట్టీ అనే హోటల్ యజమాని ముంబైలో వెళుతుండగా వీరంతా కలిసి ఆయనపై దాడి చేశారు. అనంతరం తుపాకీతో షెట్టీపై కాల్పులు జరిపారు. ఈ ఘటన అంధేరీ ప్రాంతంలో జరిగింది. ప్రస్తుతం రాజన్ న్యూఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నాడు. అక్టోబర్ 2015లో ఇండోనేషియాలో రాజన్‌ను ఆదేశ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అక్కడి నుంచి భారత్‌కు తీసుకురావడం జరిగింది.

Chhota Rajan sentenced to 8years Jail for attempted murder, extortion

ఫేక్ పాస్ పోర్టు కలిగి ఉన్నాడన్న దానిపై చోటా రాజన్ పై ఢిల్లీలో కేసు నమోదైంది. ఇక ముంబైలోని జర్నలిస్టు జే డే హత్య కేసులో కూడా ప్రధాన నిందితుడు చోటారాజన్ కావడం విశేషం. జేడే హత్యకేసులో ప్రత్యేక న్యాయస్థానం చోటారాజన్‌తో పాటు మరో ఎనిమిదిమందిని దోషులుగా తేలుస్తూ వారికి జీవితకాల కారాగార శిక్ష విధించింది.

English summary
Notorious gangster Chhota Rajan alias Rajendra S Nikhalje was on Tuesday sentenced to eight years in jail in hotelier BR Shetty extortion and attempt to murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X