వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికెన్ బిర్యానీకే జైకొట్టిన జనం.. 2019ఫుడ్ డెలివరీ రిపోర్టులో ఆసక్తికర విషయాలు

|
Google Oneindia TeluguNews

ఒక్కసారి గుర్తుచేసుకోండి.. ఈ ఏడాదిలో మీరు ఎన్నిసార్లు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుంటారు? 5 సార్లు.. 10 సార్లు.. గుర్తుకు రావడంలేదా? అదేమరి చికెన్ బిర్యానీ మహత్యం! ఎన్నిసార్లు తిన్నా.. ఎంతో రుచిరా.. అని పాడుకోవడమేగానీ లెక్కలెవడు పెడతాడు? నిజమే.. తినేవాడికి టేస్టే ముఖ్యం కావచ్చు కానీ అమ్మేవాడికి లెక్కలు కూడా ఇంపార్టెంటే. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ కొన్ని గంటల కిందటే 2019 రిపోర్టును విడుదల చేసింది. అంటే, ఈ ఏడాదిలో ఎక్కువగా డెలివరీ చేసిన ఐటమ్స్ లో టాప్ ప్లేస్ లో ఏవేవి నిలిచాయో లో వెల్లడించిందనమాట.

 అరె చిచ్చా.. చికెన్ బిర్యానీ లారే..

అరె చిచ్చా.. చికెన్ బిర్యానీ లారే..

స్విగ్గీ యానువల్ రిపోర్టు ప్రకారం మన దేశంలో ఈ ఏడాది జనం ఎక్కువగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ చికెన్ బిర్యానీ. దేశవ్యాప్తంగా సగటున నిమిషానికి 95 చికెన్ బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. అంటే, ఒక రోజులో దాదాపు 1.40 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ అయ్యాయన్నమాట. ఇది కేవలం స్విగ్గీ సంగతే. జొమాటో, ఉబెర్ ఈట్స్ లాంటి ఇతర యాప్ లు, అన్ని హోటళ్ల 'టేక్ అవే‘ కౌంటర్ల లెక్క తీస్తే.. నంబర్లు రాసుకోవడమే కష్టమవుతుందేమో. నిజానికి చికెన్ బిర్యానీ టాప్ ప్లేస్ ను ఆక్రమించడం ఇది కొత్తేంకాదు. గత ఐదేండ్ల నుంచి ఫుడ్ యాప్ డెలివరీల్లో ఈ రెసిపీనే రారాజుగా కొనసాగుతున్నది.

పాపం మటర్ బిర్యానీ.. ఐదో ప్లేస్ కి పడిపోయింది

పాపం మటర్ బిర్యానీ.. ఐదో ప్లేస్ కి పడిపోయింది

స్విగ్గీ రిపోర్టు ప్రకారం ఫుడ్ ఆర్డర్లలో చికెన్ బిర్యానీ తర్వాతి స్థానం ‘మసాలా దోశ‘కు దక్కింది. మూడో ప్లేస్ లో పన్నీర్ బటర్ మసాలా.. నాలుగో స్థానాన్ని చికెన్ ఫ్రైడ్ రైస్ ఆక్రమించాయి. ఆ తర్వాతగానీ ఐదో ప్లేస్ లో మటన్ బిర్యానీకి చోటు దక్కింది. మళ్లీ ఆరో ప్లేస్ లో చికెన్ దమ్ బిర్యానీ.. ఆ తర్వాతి స్థానాల్లో వెజ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరీ చికెన్, దాల్ మఖని ఉన్నాయి.

రూ.1500 చికెన్ బర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా?

రూ.1500 చికెన్ బర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా?

మోస్ట్ ఫేవరెట్ లిస్టుతోపాటు తాము డెలివరీ చేసిన ఐటమ్స్ లో అతి తక్కువ ధర, అత్యంత ఎక్కువ ధరల వివరాల్ని కూడా స్విగ్గీ తన రిపోర్టులో పొందుపర్చింది. ఈ ఏడాదిలో ఆ సంస్థ డెలివరీ చేసిన ఖరీదైన ఐటమ్ ఏంటో తెలుసా? అవును, మళ్లీ చికెన్ బిర్యానీనే. పుణెకు చెందిన ఓ హోటల్.. ‘చికెన్ సజూక్ బిర్యానీ‘ పేరుతో తయారుచేసిన డిష్ ను అక్షరాలా 1500 రూపాయలకు డెలివరీ చేసినట్లు స్విగ్గీ చెప్పింది. ముంబైలో దొరికే 19 రూపాయాల ‘చాల్ ధానూ తవా బిర్యానీ‘ తాము డెలివరీ చేసిన వాటిలో తక్కువ ధర ఐటమ్ అని పేర్కొంది.

గులాబ్‌జామ్.. వింటేనే నోట్లో నీళ్లురతాయ్..

గులాబ్‌జామ్.. వింటేనే నోట్లో నీళ్లురతాయ్..

ఇక డెజర్ట్స్ విషయానికొస్తే ఈ ఏడాది గులాబ్‌జామ్.. మిగతా ఐటమ్స్ గూబ బుయ్ మనిపిస్తూ దూసుకుపోయింది. స్విగీకి ఈ ఏడాదలో ఏకంగా 17లక్షల 69వేల 399 ఆర్డర్లు వచ్చాయని, దాదాపు 12 లక్షల ఆర్డర్లతో ఫలూదా సెకండ్ ప్లేస్ లో నిలిచిందని స్విగ్గీ తెలిపింది. మిగతా ఫేవరెట్ ఐటమ్స్ లిస్టులో చాక్లెట్లు, కోకోనట్ ఐస్ క్రీమ్, కేసర్ హల్వా ఉన్నట్లు చెప్పింది.

కిచిడీ జోరు..

కిచిడీ జోరు..

అనూహ్యంగా కిచిడీ ఐటమ్ ఆర్డర్లు ఏటికేడు పెరుగుతున్నాయని, గతేడాదిలో పోల్చుకుంటే ఈసారి ఏకంగా 128 శాతం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని, ముఖ్యంగా ప్రజలు ఫుడ్ రూల్స్ ను గట్టిగా ఫాలోఅయ్యే నవరాత్రి సీజన్ లో కిచిడీ ఆర్డర్లు బాగా పెరిగాయని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ప్రకటించింది. సో, ఇదండీ ఈ ఏడాది ఫేవరెట్ పదార్థాల చిట్టా. చదివి అసిపోతే సరదాగా చికెన్ బిర్యానీ అర్డర్ చేస్తారుగా..

English summary
According to the annual report released by Swiggy, in 2019, Indians have ordered an average of 95 Chicken Biryanis per minute across the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X