వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బర్డ్ ప్లూ టెన్షన్: చికెన్, ఎగ్స్ షాప్స్ 15 రోజులు క్లోజ్.. ఎక్కడ అంటే..

|
Google Oneindia TeluguNews

బర్డ్ ప్లూ భయాందోళన నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఒకడుగు ముందు వేసిన మధ్యప్రదేశ్ మండసౌర్ అధికారులు 15 రోజులు ఆంక్షలు విధించారు. బర్డ్ ప్లూ.. చికెన్, కోడిగుడ్ల ద్వారా సోకుతున్నందున వాటి విక్రయాలపై నిషేధం విధించారు. ఇక్కడ కాకుల ద్వారా బర్డ్ ప్లూ వ్యాపిస్తోందని నిర్దారించారు. అందుకోసమే 15 రోజుల వరకు చికెన్, కోడి గుడ్ల విక్రయాలపై నిషేధం విధించారు.

కాకుల ద్వారా ప్లూ వ్యాధి విస్తరిస్తోందని నిర్ధారణ జరిగింది. మండసౌర్‌లో ఇప్పటికే 100 కాకులు చనిపోయాయి. దీంతో ఆందోళన నెలకొంది. ఇటు ఇండోర్‌లో చనిపోయిన కాకులలో బర్డ్ ప్లూ ఉందని మధ్యప్రదేశ్ అధికారులు గుర్తించారు. ఇతర జిల్లాల్లో కూడా మరణాలు సంభవించాయని అధికారులు తెలిపారు.

chicken, egg shops ordered to stay closed for 15 days..

కాకుల ద్వారా బర్డ్ ప్లూ వేగంగా వ్యాపిస్తోన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అనుకూలంగా చర్యలు తీసుకుంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఇండోర్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇక్కడ చనిపోయిన కాకుల నుంచి బర్డ్ ప్లూ శాంపిల్స్ సేకరిస్తారు. డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు ఇండోర్‌లో 142 కాకులు, మండసౌర్‌లో 100, ఆగర్ మల్వాలో 112, ఖార్గొన్‌లో 13 కాకులు చనిపోయి కనిపించాయి.

English summary
Mandsaur authorities in Madhya Pradesh have ordered the shops selling chicken and eggs to remain closed for 15 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X