వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ సర్కార్‌పై చిదంబరం గుస్సా: కన్హయ్య కుమార్‌పై దేశద్రోహ కేసు విచారణపై మండిపాటు..

|
Google Oneindia TeluguNews

జేఎన్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌పై ఇదివరకు నమోదైన దేశద్రోహం కేసును అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం విచారించడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తప్పుపట్టారు. 2016లో కన్హయ్యతోపాటు మరో తొమ్మిది మందిపై దేశద్రోహం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అప్పటి కేసును ఇప్పుడు పున: ప్రారంభించడంపై పీ చిదంబరం పెదవి విరిచారు. కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య సరికాదని విమర్శించారు.

దేశద్రోహ చట్టాన్ని అర్థం చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం కన్నా ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని చిదంబరం ఆరోపించారు. 120బీ, 124ఏ సెక్షన్ల కింద నమోదైన కేసుకు సంబంధించి దేశ ద్రోహం విచారణ జరిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని స్పష్టంచేశారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు విచారించాలని స్టాండింగ్ న్యాయవాది సలహా ఇచ్చిన ఏడునెలల తర్వాత విచారణ జరపడాన్ని తప్పుపట్టారు.

Chidambaram criticises Delhi govt decision to prosecute Kanhaiya in sedition case

పార్లమెంట‌్‌పై దాడి చేసిన దోషి అప్జల్ గురును ఉరితీయడంపై వ్యతిరేకంగా ఫిబ్రవరి 9.. 2016లో జేఎన్‌యూలో నినాదాలు చేశారని చార్జీషీట్‌లో పోలీసులు పేర్కొన్నారు. పార్లమెంట్‌పై దాడిచేసిన ఉగ్రవాదిని ఉరితీస్తే వ్యతిరేకిస్తూ... దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే.

దేశ ద్రోహ కేసు విచారణపై కన్హయ్య కుమార్ స్పందించారు. కేసు విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో విచారణ వేగంగా పూర్తవుతోందని ఆయన ఆకాంక్షించారు. అయితే దేశద్రోహ కేసులు, ఇతర కేసులు రాజకీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నాయని, దీంతో తప్పుచేయని వారికి కూడా శిక్ష పడుతోందని కన్హయ్య కుమార్ ట్వీట్ చేశారు.

English summary
former finance minister P Chidambaram Saturday criticised the Arvind Kejriwal-led Delhi government for giving the go-ahead to prosecute former JNUSU president Kanhaiya Kumar 2016 JNU sedition case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X