వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందూత్వ ఎజెండే ముఖ్యం, వ్యవస్థలను లెక్కచేయని మోడీ సర్కార్, పీ చిదంబరం ఫైర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Citizenship Amendment Bill 2019 : Will CAB Clear Rajya Sabha? || Oneindia Telugu

పౌరసత్వ సవరణ బిల్లుతో హిందూత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం విమర్శించారు. దేశ పౌరుడికి జన్మత పౌరసత్వం వస్తోందని చెప్పారు. కానీ సంతతి అని చెప్పి, పేరు నమోదు చేయించుకోవాలని, భూభాగం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పౌరసత్వ సవరణ బిల్లు బీజేపీ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయమని చిదంబరం అభివర్ణించారు.

పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోడీపౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ప్రధాని మోడీ

 వ్యవస్థలు అంటే లెక్కలేదు

వ్యవస్థలు అంటే లెక్కలేదు

న్యాయ వ్యవస్థను కూడా లెక్క చేయడం లేదా అని కేంద్ర ప్రభుత్వాన్ని చిదంబరం ప్రశ్నించారు. ప్రజలచేత ఎన్నుకొబడిన ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌లో ఇది రాజ్యాంగానికి విరుద్ధమని, ఇది తప్పొ ఒప్పో అనే అంశాన్ని న్యాయవ్యవస్థ నిర్ణయిస్తోందని చెప్పారు. కానీ మోడీ ప్రభుత్వం న్యాయవ్యవస్థే కాదు పార్లమెంట్ సభ్యుల మాటను కూడా లెక్కచేయడం లేదన్నారు.

ప్రశ్నల వర్షం

ప్రశ్నల వర్షం

పౌరసత్వ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వాన్ని పలు అంశాలపై చిదంబరం నిలదీశారు. దేశాన్ని మతపరంగా విభజించాలని అనుకొంటున్నారా అని ప్రశ్నించారు. మన దేశంతో భూభాగం పంచుకొనే మూడు దేశాలనే మోడీ ప్రభుత్వం ఎందుకు టార్గెట్ చేసిందని చిదంబరం ప్రశ్నించారు. మిగతా దేశాలను ఎందుకు లెక్కలోకి తీసుకోలేదని నిలదీశారు. ఇందుల్లో క్రిస్టియన్లు, మిగతా రెండు మతాలనే ఎందుకు మినహాయించారని అడిగారు.

మొట్టికాయలు తప్పవు

మొట్టికాయలు తప్పవు

పార్లమెంట్‌లో మోడీ సర్కార్ చేసిన చట్టం న్యాయవ్యవస్థ చేత మొట్టికాయలు తినడం ఖాయమని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం రాజ్యసభ ముందుకు బిల్లు తీసుకొచ్చిందని విమర్శించారు. చట్టసభల్లో రాజ్యాంగవిరుద్ధంగా ఏమీ జరగకుండా చూడటం తమ విధి అని చిదంబరం పేర్కొన్నారు. మతపరంగా కొందరినీ టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

వారికే ఎందుకు

వారికే ఎందుకు

క్రిస్టియన్లు, మిగతా రెండు సామాజికవర్గాలకు చెందిన వారిని మాత్రం ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రశ్నించారు. మిగతా మతాల టార్గెట్ వెనక కారణం ఏంటో అందరికీ తెలుసున్నారు. పౌరసత్వ సవరణ బిల్లును రాజ్యసభకు తీసుకొచ్చిన బుధవారం చాలా బాధాకరమైన రోజు అని చిదంబరం పేర్కొన్నారు.

English summary
narendra modi government is ramming through this Bill to advance its Hindutva agenda P Chidambaram said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X