వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీహార్‌ జైల్లో ఉండాల్సిన ఫ్యామిలీ: చిదంబరం కుటుంబంపై స్వామి ఫైర్‌

బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి కేంద్రమాజీ మంత్రి చిదంబరం కుటుంబంపై విరుచుకుపడ్డారు. చిదంబరం, ఆయన తనయుడు కార్తీ ఇద్దరూ తీహార్‌ జైలుకు వెళ్లాల్సిన వాళ్లేనని స్వామి వ్యాఖ్యానించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి మరోసారి కేంద్రమాజీ మంత్రి చిదంబరం కుటుంబంపై విరుచుకుపడ్డారు. చిదంబరం, ఆయన తనయుడు కార్తీ ఇద్దరూ తీహార్‌ జైలుకు వెళ్లాల్సిన వాళ్లేనని స్వామి వ్యాఖ్యానించారు. చిదంబరం కుటుంబాన్ని మోసగాళ్ల ఫ్యామిలీగా ఆయన అభివర్ణించారు.

కార్తీ అతి పెద్ద మోసగాడని స్వామి ధ్వజమెత్తారు. మంచి చదువు లేదు.. మంచి ఉద్యోగం చేయలేదు.. అయినా వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని, ఇంత సంపదను ఎలా సృష్టించారని స్వామి ప్రశ్నించారు.

subramanian-swamy

వ్యాపారస్తుల దగ్గర కార్తీ అక్రమంగా డబ్బును వసూలు చేశారని.. అందువల్లే ఇంత సంపదను పోగేయగలిగారని వ్యాఖ్యానించారు. ఇక చిదంబరం భార్య నళిని సైతం ఇలాగే డబ్బులు వసూలు చేసేవారని స్వామి ఆరోపించారు. చిదంబరం ఫ్యామిలీని తీహార్‌ జైలుకు పంపాలని స్వామి అన్నారు.

కార్తీ చిదంబరం విదేశీ బ్యాంకుల్లో ఉన్న తన అకౌంట్లను మూసివేసేందుకే విదేశాలకు వెళుతున్నారని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపిన తరువాత స్వామి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

English summary
Bharatiya Janata Party (BJP) leader Subramanian Swamy on Saturday called the Chidambaram family “a family of crooks” and said that both Karti and his father P. Chidambaram belong to Tihar Jail. “He (Karti) is a crook. He has no proper education, no occupation, how does he have so much wealth? It is all fraud. His father (P Chidambaram) does the illegal act and he (Karti) collects the money,” Swamy told ANI.Chidambaram’s wife Nalini also does the same. They are all family of crooks and they belong as a family in Tihar jail,” he added. The BJP leader’s remarks comes a day after the Central Bureau of Investigation (CBI) told the Supreme Court that Karti was prevented from travelling abroad as he was allegedly closing his foreign bank accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X