వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంకు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం 106 రోజులుగా తీహార్ జైలులో ఉన్నారు. ఆగష్టు 21న ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. అయితే బుధవారం బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది.చిదంబరం తన పాస్‌పోర్టును అప్పగించాలని దేశం దాటి పోరాదనే షరతులు విధించింది కోర్టు.

Chidambaram finally granted bail by Supreme court after 105 days

చిదంబరంను సీబీఐ ఆగస్ట్ 21వ తేదీన అరెస్టు చేశారు. ఆ తర్వాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియాలోకి నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు తరలించారని అభియోగాలతో ఈయనను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయనకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయన 106 రోజులు తీహార్ జైలులో ఉన్నారు.

దేశం దాటవద్దని, మీడియాతో మాట్లాడవద్దని భారత అత్యున్నత న్యాయస్థానం షరతులు విధించింది. రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసును తీవ్ర ఆర్థికనేరంగా పరిగణించి బెయిల్ ఇవ్వవద్దని ఈడీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది. చిదంబరానికి బెయిల్ ఇస్తే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోందని ఈఢీ పేర్కొంది. కానీ ఈడీ వాదనను జస్టిస్ భానుమతి ధర్మాసనం తోసిపుచ్చింది.

English summary
The Supreme Court on Wednesday granted bail to P Chidambaram in the INX Media corruption case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X