వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐకి కనిపించని చిదంబరం... లుక్ అవుట్ నోటీసులు జారీ....అరెస్ట్‌పై ఉహాగానాలు

|
Google Oneindia TeluguNews

ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించడంతో మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం అదృశ్యం అయ్యారు. ఢిల్లీ కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రిం కోర్టును సైతం ఆశ్రయించారు. అయితే అంతకు ముందే సిబిఐ తోపాటు ఈడీ అధికారులు ఆయన చేరుకోవడంతో వారికి చుక్కెదురైంది. చిదంబరం ఇంట్లో లేకపోవడం వారు వెనుదిరిగారు. దీంతో ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ ఉన్నట్టు సమాచారం. ఇక ఆయన ఆచూకి కోసం దర్యాప్తు సంస్థలు వెతుకున్నాయి. మంగళవారం అర్థరాత్రిలోగా కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేశాయి. అయితే చిదంబరం నుండి ఎలాంటీ సమాచారం లేదు. కాగా ఆయన బెయిల్ కోసం వేసిన పిటిషన్ బుధవారం సుప్రిం కోర్టు విచారించనుంది.

మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం ఎదుర్కోంటున్న ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రిం కోర్టును ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కనిపించకుండా అదృశ్యం అయ్యారు. ముందస్తు బెయిలుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చిదంబరంను ప్రశ్నించేందుకు వీలుగా ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ఇప్పటికే కోరింది. సాయంత్రం చిదంబరం ఇంటికి దర్యాప్తు అధికారులు వెళ్లారు. కాగా ఈ కేసుకు సంబందించి, కీలక పాత్రదారిగా ఉన్న కార్తి చిదంబరాన్ని సైతం సిబిఐ అరెస్ట్ చేసింది. అనంతరం కార్తి చిదంబరం బెయిల్‌పై విడుదల అయ్యాడు.

Chidambaram is untraceable,Agencies are on the lookout for him.

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందం, రూ. 305కోట్ల ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీతోపాటు సీబిఐ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఒప్పందాల సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే నేడు విచారణ నిమిత్తం ఈడీ చిదంబరానికి సమన్లు కూడ జారీ చేసింది. దీంతో ఆయన ఈడీ విచారణ కూడ హజరయ్యారు.

ఈ నేపథ్యంలనే ఈ కేసుల్లో చిదంబరానికి దిల్లీ హైకోర్టులో పలుసార్లు తాత్కాలిక ఊరట కల్పించింది. గత జనవరి 15 వరకు ఆయనను అరెస్టు చేయకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి జనవరి 25న వాదనలు జరిగాయి. చిదంబరం అరెస్ట్‌పై వాదనలు జరిగాయి. అటు సిబిఐ గాని, ఈడీగాని చిదంబరం అరెస్ట్‌ను కోరాయి. అయితే వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసి నేడు ముందస్తు బెయిల్ నిరాకరించింది. మరోవైపు అరెస్ట్‌కు మూడు రోజుల ముందు అప్పిల్ చేయడానికి అవకాశం ఇవ్వాలన్న పిటిషన్ పై కోర్టు స్పందించలేదు. దీంతో బెయిల్ కోసం సుప్రిం ను ఆశ్రయించారు చిదంబరం.

English summary
Chidambaram is untraceable. He has switched off his phones. Agencies are on the lookout for him.A team of CBI reached P Chidambaram’s residence on Tuesday evening after the Delhi HC rejected his bail plea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X