వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్నొక్కడినే అరెస్ట్ చేస్తారా?: చిదంబరం అనుమానం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో మనీ ల్యాండరింగ్ చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తున్న కేసులో అరెస్టయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం సోమవారం పలు ప్రశ్నలను సంధించారు. ఈ కేసులో తాను ఒక్కడినే తప్పు చేసినట్లు అధికారులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. తనను ఒక్కడినే అరెస్టు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చెప్పారు. ఈ మేరకు సోమవారం చిదంబరం కుటుంబ సభ్యులు ఆయన తరఫున ట్వీట్లు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటిదాకా ఏ ఒక్క అధికారి కూడా అరెస్టు ఎందుకు కాలేదని, ఆయన ఒక్కరే ఎందుకు అరెస్టు అయ్యారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారని చెప్పారు.

పైలెట్ల మెరుపు సమ్మె: బ్రిటీష్ ఎయిర్ వేస్ విమాన సర్వీసులన్నీ రద్దు..ప్రయాణికుల పడిగాపులు!పైలెట్ల మెరుపు సమ్మె: బ్రిటీష్ ఎయిర్ వేస్ విమాన సర్వీసులన్నీ రద్దు..ప్రయాణికుల పడిగాపులు!

ఐఎన్ఎక్స్ మీడియాలో 307 కోట్ల రూపాయల మేర విదేశీ పెట్టుబడులను నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఇచ్చిన కేసు విషయంలో చిదంబరం అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఇప్పటిదాకా అరెస్టయింది చిదంబరం ఒక్కరే. అదే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతి ఇస్తూ విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) అధికారులు జారీ చేసిన ప్రతిపాదనలపై తాను సంతకం మాత్రమే చేశానని అన్నారు. ఆ ప్రతిపాదనలను రూపొందించిన అధికారులు ఎందుకు అరెస్ట్ కాలేదని తననను పలువురు నిలదీస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ- తాను ఏ ఒక్క అధికారి మీదా నింద మోపబోనని, వారు అరెస్టు కావడం తనకు ఇష్టం లేదని అన్నారు.

Chidambaram’s message from Tihar: Have no answer to why I was arrested

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ఈ నెల 5వ తేదీన అరెస్టయిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం ఆయనను సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సీబీఐ అధికారుల కస్టడీలో ఉన్న ఆయన తీహార్ లోని ఏడో నంబర్ కారాగారంలో ఉంటున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు ఆయన కస్టడీ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ అకౌంట్ ను చిదంబరం కుటుంబ సభ్యులు హ్యాండిల్ చేస్తున్నారు. చిదంబరం తరఫున వారే తాజాగా ట్వీట్లను సంధించారు. చిదంబరాన్ని తాము పరామర్శించడానికి వెళ్లిన సందర్భంగా ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేశారని, వాటిని తాము ట్వీట్ల రూపంలో బయటి ప్రపంచానికి తెలియజేస్తున్నామని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

English summary
Senior Congress leader and former union minister P Chidambaram, who is in Tihar Jail in the INX Media case, Monday said he has no answer to why only he was arrested and not any of the officers who had recommended granting Foreign Investment Promotion Board (FIPB) clearance to the INX Media group for receiving overseas funds of Rs 305 crore in 2007.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X