వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టుకు చిదంబరం..నేటితో ముగియనున్న సీబీఐ కస్టడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం సీబీఐ కస్టడీ నేటితో ముగియనుండటంతో ఆయన్ను సుప్రీంకోర్టు ముందు ప్రవేశపెట్టనుంది సీబీఐ. సీబీఐ కస్టడీపై కింది కోర్టు ఇచ్చని తీర్పును సుప్రీంకోర్టులో చిదంబరం సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేయనుంది.

హెల్మెట్ ధరించని వాహనదారులకు స్వీట్లు పంపిణీ: ఎక్కడో తెలుసా?హెల్మెట్ ధరించని వాహనదారులకు స్వీట్లు పంపిణీ: ఎక్కడో తెలుసా?

కేసుకు సంబంధించి సీబీఐ ప్రతీసారి ఒకే రకమైన ఫైల్స్‌ను చూపిస్తోందని తాను అవకతవకలకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలను మాత్రం రుజువు చేయలేకపోతోందని చిదంబరం ఢిల్లీ కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు ప్రతీసారి అవే మూడు ఫైళ్లను చూపిస్తున్నారని ఇక విచారణ చేసిన రెండునర్ర గంటలపాటు అదే ఫైళ్లు చూపించారని చిదంబరం సీబీఐ న్యాయస్థానానికి తెలిపారు. దీంతో సీబీఐ కోర్టు సెప్టెంబర్ 2వ తేదీవరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆగష్టు 21న చిదంబరంను సీబీఐ అరెస్టు చేసిన తర్వాత మూడో సారి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాదు ఒకేసారి 15 రోజులు పాటు కస్టడీకి ఎందుకు కోరడం లేదని ఇన్ని సార్లు తీసుకురావాల్సిన అవసరం ఏముందని సీబీఐపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Chidambaram to be produced in Supreme court as the CBI custody ends

ఇదిలా ఉంటే తొలిసారి సీబీఐ చిదంబరంను అదుపులోకి తీసుకున్న సమయంలో 5రోజుల పాటు కస్టడీని కోరింది.ఆగష్టు 26న రెండో సారి కోర్టులో హాజరు పరచినప్పుడు కూడా మరో 5 రోజుల పాటు కస్టడీకి కోరింది. ఇక సోమవారం కూడా మరో ఐదురోజుల పాటు కస్టడీ కోరడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం. చట్ట ప్రకారం అవినీతి కేసులో ఒక వ్యక్తిని విచారణ చేసేందుకు గరిష్టంగా 15రోజుల పాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇక వాదనల సమయంలో సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంకా ఐదు రోజులు దేనికోసమని జడ్జి అడిగారు. అసలు విచారణ క్రమం ఎలా జరిగిందో దానికి సంబంధించిన డైరీ కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించారు.

English summary
Former Finance Minister P Chidambaram's CBI custody will come to an end on Monday when he will be produced before the Supreme Court.The Supreme Court will hear Chidambaram's petition challenging the trial court's order to remand him to CBI's custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X