వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో బెయిల్, నో ట్రీట్‌మెంట్, తీహర్ జైలులోనే.. చిదంబరం చికిత్సపై మెడికల్ బోర్డు

|
Google Oneindia TeluguNews

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరానికి ఇప్పట్లో బెయిల్ లభించేలా లేదు. సీబీఐ, ఈడీ ఒకరి వెనక ఒకరు రిమాండ్‌కు తీసుకోవడంతో ఆయన జైలుకు పరిమితమయ్యారు. దీంతోపాటు అనారోగ్య సమస్యల కోసం తాను హైదరాబాద్ వెళ్తానని చిదంబరం పిటిషన్ వేశారు. కానీ అక్కడ కూడా మాజీ కేంద్రమంత్రికి చుక్కెదురైంది.

 చిదంబరం కస్టడీ పొడిగింపు: తీహార్ జైలులో వెస్టర్న్ టాయ్ లెట్, ప్రత్యేక సెల్..! చిదంబరం కస్టడీ పొడిగింపు: తీహార్ జైలులో వెస్టర్న్ టాయ్ లెట్, ప్రత్యేక సెల్..!

 జైలుకే పరిమితమా..?

జైలుకే పరిమితమా..?

ఐఎన్ఎక్స్ మీడియా కేసు చిదంబరాన్ని నీడలా వెంటాడుతుంది. ఇప్పటికే తీహర్ జైలులో ఉన్న చిదంబరం.. అనారోగ్య సమస్యలను ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. కడుపునొప్పితో ఇటీవల ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు. అయితే చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తానని మరో పిటిషన్ వేశారు. దీనిపై మెడికల్ బోర్డులో కూడా చిదంబరానికి చుక్కెదురైంది. చిదంబరాన్ని హైదరాబాద్ పంపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. చిదంబరాన్ని జైలులోనే ఉంచాలని కోరింది. ఎయిమ్స్‌లో కూడా చికిత్స అందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

కడుపునొప్పి..

కడుపునొప్పి..

74 ఏళ్ల చిదంబరానికి తీహర్ జైలులో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. అయితే కడుపునొప్పి సమస్యకు సంబంధించి ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి వెళతానని కోరారు. వైద్యులు తమ ఫ్యామిలీ డాక్టర్ అని పేర్కొన్నారు. జైలులో ఉండటంతో ఇప్పటికే చిదంబరం 7 కేజీల బరువు కూడా తగ్గారు. 73 కేజీల నుంచి 66 కేజీలకు చేరారు. ఆయా అంశాలను హైకోర్టుకు విన్నవించారు. కానీ మెడికల్ బోర్డు మాత్రం తోసిపుచ్చింది. మెడికల్ బోర్డు వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ఏషియన్ వద్దు

ఏషియన్ వద్దు

కావాలంటే చిదంబరం ఎయిమ్స్‌లో చికిత్స పొందొచ్చని సూచించింది. హైదరాబాద్‌లో చికిత్స అవసరం లేదని తేల్చిచెప్పింది. చిదంబరానికి చికిత్స అందించే వైద్యులు అతను ఉండే ప్రాంతం పరిశుభ్రంగా ఉంటే చాలనే విషయాన్ని ప్రస్తావించారని గుర్తుచేశారు.

జైలే బెటర్..?

జైలే బెటర్..?

దీంతో జస్టిస్ కైట్ స్పందించారు. చిదంబరం బ్యారక్‌లో దోమల బెడదను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జైలు అధికారులను ఆదేశాలు జారీచేశారు. దీంతోపాటు మంచినీరు, ఫేస్ మాస్క్ కూడా చిదంబరానికి ఇవ్వాలని స్పష్టంచేశారు. తగిన సూచనలు వెంటనే అమల్లోకి తీసుకురావాలని జైలు అధికారులకు తేల్చిచెప్పారు.

English summary
There is no need to admit former finance minister P Chidambaram to the All India Institute of Medical Sciences, a medical board told the Delhi High Court on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X