వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడిగిన ముత్యంలా బయటకొస్తారు.. చిదంబరం తీహార్ జైలుకు తరలింపుపై కార్తీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తీహర్ జైలుకు వెళ్లారు. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ హైకోర్టు మరోసారి రిమాండ్‌కు ఇచ్చింది. ఈ నెల 19 వరకు రిమాండ్‌లో ఉంటారని పేర్కొన్నది. దీంతోపాటు అతనిని తీహార్ జైలుకు కూడా తరలించారు. దీనిపై చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం స్పందించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తన తండ్రి, తాను తప్పు చేయలేదని పేర్కొన్నారు.

ఎన్‌ఎక్స్‌ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం, పీటర్ ముఖర్జీలు నిందితులుగా ఉన్నారు. గతేడాది కార్తిని అరెస్ట్‌ చేసిన దర్యాప్తు సంస్థలు 23 రోజుల పాటు కస్టడీలో ఉంచి విచారణ చేపట్టాయి. అయితే ఇటీవల పీటర్ అప్రూవర్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిదంబరాన్ని ఈ నెల 21 సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. రెండు వారాల నుంచి సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు.

chidambaram will be back in home : karthi chidambaram hope

చిదంబరాన్ని తీహర్ జైలుకు తరలించడంపై ఆయన కుమారుడు కార్తీ స్పందించారు. తన తండ్రి ఏ తప్పు చేయలేదన్నారు. ఈ కేసులో కావాలనే ఇరికించారని పేర్కొన్నారు. ఈ కేసు నుంచి తాము కడిగిన ముత్యాల్లా బయటపడుతామని తెలిపారు. అతి త్వరలో తన తండ్రి చిదంబరం ఇంటికి తిరిగొస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తమపై ఎన్డీఏ ప్రభుత్వం కక్షపూరితంగా కేసు నమోదు చేసిందని వెల్లడించారు.

English summary
Former Union Finance Minister Chidambaram has gone to jail in the INX media case. The Delhi High Court has once again remanded the case to trial. It will be remanded till the 19th of this month. He was also taken to Tihar Jail. Chidambaram's son Karthi Chidambaram responded. His father, in the INX media case, claimed he had done nothing wrong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X