వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎన్ఎక్స్ కేసులో సుప్రిం కోర్టును ఆశ్రయించిన పి. చిదంబరం.. అరెస్ట్‌పై ఉహాగానాలు

|
Google Oneindia TeluguNews

మాజీ ఆర్ధిక మంత్రి పీ చిదంబరం ఎదుర్కోంటున్న ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఢిల్లి హైకోర్టు నిరాకరించడంతో ఆయన సుప్రిం కోర్టును ఆశ్రయించేందుకు సిద్దమయ్యారు. దీంతో కేసును అత్యవసరంగా వాదనలు చేపట్టాలని కోరనున్నారు.. ముందస్తు బెయిలుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో చిదంబరాన్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చిదంబరంను ప్రశ్నించేందుకు వీలుగా ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ ఇప్పటికే కోరింది. కాగా ఈ కేసుకు సంబందించి, కీలక పాత్రదారిగా ఉన్న ఇప్పటికే కార్తి చిదంబరాన్ని సైతం సిబిఐ అరెస్ట్ చేసింది. అనంతరం కార్తి చిదంబరం బెయిల్‌పై విడుదల అయ్యాడు.

యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ. 3,500కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందం, రూ. 305కోట్ల ఐఎన్‌ఎక్స్‌ మీడియా ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీతోపాటు సీబిఐ దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఒప్పందాల సమయంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతి ఇవ్వడంలో చిదంబరం అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుపై ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే నేడు విచారణ నిమిత్తం ఈడీ చిదంబరానికి సమన్లు కూడ జారీ చేసింది. దీంతో ఆయన ఈడీ విచారణ కూడ హజరయ్యారు.

Chidambaram will now move Supreme Court

ఈ నేపథ్యంలనే ఈ కేసుల్లో చిదంబరానికి దిల్లీ హైకోర్టులో పలుసార్లు తాత్కాలిక ఊరట కల్పించింది. గత జనవరి 15 వరకు ఆయనను అరెస్టు చేయకుండా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరోసారి జనవరి 25న వాదనలు జరిగాయి. చిదంబరం అరెస్ట్‌పై వాదనలు జరిగాయి. అటు సిబిఐ గాని, ఈడీగాని చిదంబరం అరెస్ట్‌ను కోరాయి. అయితే వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసి నేడు ముందస్తు బెయిల్ నిరాకరించింది. మరోవైపు అరెస్ట్‌కు మూడు రోజుల ముందు అప్పిల్ చేయడానికి అవకాశం ఇవ్వాలన్న పిటిషన్ పై కోర్టు స్పందించలేదు.

English summary
Chidambaram will now move Supreme Court,Chidambaram's bail plea in INX Media case rejected by Delhi HC,After the court pronounced the order, senior advocate Dayan Krishnan, appearing for Chidambaram, sought stay on the operation of the order for three days, to which the court said that it will consider the request and will pass order on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X