వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసంతృప్త న్యాయమూర్తులతో సిజెఐ భేటీ: పరిష్కారం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనపై విమర్శనాస్త్రాలు సంధించిన నలుగురు అసంతృప్త న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సమావేశమైనట్లు తెలుస్తోంది. వారితో దాదాపు 15 నిమిషాల సమావేశం జరిగినట్లు సమాచారం.

సుప్రీంకోర్టులో పరిపాలన దక్షతపై, కేసుల కేటాయింపుపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వారు లేవనెత్తిన అంశాలపై దీపక్ మిశ్రా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Chief Justice Met 4 Judges, Discussed All Issues, Say Sources

ఈ నెల 12వ తేదీన నలుగురు న్యాయమూర్తులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వారితో ప్రధాన న్యాయమూర్తి సమావేశం కావడం ఇదే తొలిసారి.

న్యాయవ్యవస్థలో నెలకొన్ని సంక్షోభం ఇంకా తొలగిపోలేదని, రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే.

English summary
The Chief Justice of India, Dipak Misra, met the four judges who took him on publicly, this morning and discussed, top sources told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X