వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ఆర్‌‌సీకి వ్యతిరేకంగా కోల్‌కతాలో భారీ ర్యాలీ.. పాల్గోన్న మమతా బెనర్జీ

|
Google Oneindia TeluguNews

అసోంలో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి) జాబితాలో చోటు చేసుకున్న గందరగోళానికి నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబర్ 12 న ఉత్తర కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈనేపథ్యంలోనే తన పార్టీ సహచరులతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని ఉత్తర ప్రాంతమైన సింథీ మోర్ నుండి తన పాదయాత్రను ప్రారంభించారు. కాగా ఈ ర్యాలీ ఐదు కిలోమీటర్ల దూరం కొనసాగి శ్యాంబజార్ ప్రాంతలో ముగిసింది.

ఆసోంలో ఎన్ఆర్‌సీ జాబితాను ప్రకటించినప్పటిప్పటి నుండి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ఈ జాబితా దేశంలో ప్రజలను విభజించే విధంగా ఉందని ఆమే ర్యాలీ సంధర్భంగా అన్నారు.రెండు రోజుల క్రితం కూడ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ర్యాలీలు నిర్వహించింది. జాబితా ప్రకటించడంతో కేంద్రం అభాసు పాలైందని ఆమే ఫైర్ అయ్యారు. జాబితాలో నిజమైన భారతీయులకు చోటు కల్పించకుండా అన్యాయం చేశారని ఆమే విమర్శించారు.

Chief Minister Mamata Banerjee took out a rally to protest against NRC,

ఆగస్టు 31న ఎన్ఆర్‌సీ తుది జాబితా విడుదలైంది. అయితే జాబితాలో చోటు కల్పించుకోవడం కోసం మొత్తం మూడు కోట్ల 29 లక్షల మంది ప్రజలు తమ పేర్లను నమోదు చేసుకోగా,19 లక్షల మందికి జాబితాలో చోటు దక్కలేదు.ఇందులో స్థానిక ఎమ్మెల్యేల పేర్లు కూడ లేకపోవడంతో అసోం రాష్ట్ర నాయకులతో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు జాబితాపై మండిపడ్డాయి. ఈనేపథ్యంలోనే అసోంలో కూడ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee on September 12 took out a rally in north Kolkata to protest against National Register of Citizens (NRC) in Assam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X