వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగివచ్చిన దీదీ...! ప్రధాని నరేంద్ర మోడితో సమావేశం

|
Google Oneindia TeluguNews

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూ టర్న్ తీసుకున్నారా..?. గత ఎన్నికల నుండి ప్రధాని మోడీతో రాజకీయ వైరం పెంచుకున్న ఆమే ఒకమెట్టు దిగివచ్చారా..?. గత ఆరునెలలుగా మోడీ తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ బుధవారం మోడీతో భేటి వెనక మతలబు ఏమిటి..

దేశ ప్రధాని మోడీని వ్యతిరేకిస్తున్న వారిలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకరు. రాష్ట్ర అభివృద్దికి కేంద్రం సహాకారం అవసరం లేదని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రం ఆధారపడి లేదని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే బెంగాల్‌లో వరద భాదితులను పరామర్శించేందుకు వచ్చిన మోడితో కనీసం సమావేశం కావడానికి కూడ ఆమే ఇష్టపడలేదు. దీంతోపాటు కేంద్రం తీసుకునే ప్రతి విషయంలో మోడీపై నిప్పులు చెరుగుతున్న మమతా బెనర్జీ యూ టర్న్ తీసుకుని అకస్మాత్తుగా పీఎం మోడీతో సమావేశం అయ్యోందుకు సిద్దమయ్యారు. ఈ నేపనథ్యంలోనే బుధవారం ఢిల్లీలో మోడీతో భేటి కానున్నట్టు మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించారు.

 Chief Minister Mamata Banerjee will be meeting with pm modi tomorrow.

పశ్చిమ బెంగాల్‌ పేరుమార్పిడి విషయంలో మోడీతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. బెంగాల్‌ పేరు మార్పు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉంది. దీంతోపాటు బ్యాంకుల విలీనం ,పబ్లిక్ సెక్టార్ సంస్థలైన బీఎస్ఎన్ఎల్,రైల్వే, ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నట్టు ఆమే తెలిపారు. కాని కేంద్రంతో మరిన్ని ఇబ్బందులు తలెత్తకుండా మోడీతో భేటి అయ్యోందుకు మమతా మొగ్గుచూపినట్టు సమాచారం. ముఖ్యంగా శారద స్కాంలో ఇరుక్కున్న కోల్‌కతా మాజీ పోలీసు కమీషనర్ రాజీవ్‌ కుమార్‌ సీబీఐ విచారిస్తున్న నేపథ్యంలోనే ప్రధాని మోడీతో భేటి ప్రాధాన్యత చేకూరింది. సాధరణ ఎన్నికల తర్వాత మోడీతో మమతా మొదటిసారి భేటి కానుండడంతో ఎలాంటీ పరిణామాలు జరుగుతాయో వేచి చూడాలి.

English summary
West Bengal Chief Minister Mamata Banerjee will be meeting with pm modi tomorrow. she will discuss many issues with pm naredra modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X