వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Video : పదేళ్ల బాలుడికి సీఎం వీడియో కాల్... అతని ఆత్మాభిమానానికి ఫిదా...

|
Google Oneindia TeluguNews

ఆ బాలుడి వయసు పదేళ్లు... కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులకు తానూ చేదోడు వాదోడుగా ఉండాలనుకున్నాడు. ఇందుకోసం స్కూల్ మానేసి మరీ రోడ్డుపై సాక్సులు అమ్ముతున్నాడు. పదేళ్ల వయసులో కుటుంబం కోసం ఆ బాలుడు పడుతున్న కష్టం ఏకంగా ముఖ్యమంత్రినే కదిలించింది. ఆ బాలుడికి వీడియో కాల్ చేసిన ముఖ్యమంత్రి... వారి కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ బాలుడి చదువుకు అయ్యే ఖర్చునే ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన పంజాబ్‌లోని లూథియానాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే... వంశ్ సింగ్(10) కొన్నాళ్లుగా లూథియానా రోడ్లపై సాక్సులు విక్రయిస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో స్కూల్‌ మానేసి ఇలా రోడ్డుపై పడ్డాడు. తాను సాక్సులు అమ్ముతూ సంపాదించే డబ్బును తల్లిదండ్రులకు ఇస్తున్నాడు. అలా కుటుంబ పోషణకు తనవంతు సాయం చేస్తున్నాడు. వంశ్ సింగ్‌ తండ్రి పరంజిత్ సింగ్ కూడా సాక్సులు విక్రయిస్తుంటాడు. అతని తల్లి గృహిణి. వంశ్ సింగ్‌కు ముగ్గురు అక్కాచెల్లెళ్లు,ఒక అన్న ఉన్నారు. హైబోవల్ ప్రాంతంలో వీరి కుటుంబం నివసిస్తోంది.

chief minister video call to 10 years old boy after impressed by boys self esteem

వంశ్ సింగ్‌ పసితనానికి జాలి పడి ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇచ్చినా అతను తీసుకోడు. తనది కానిది ఒక్క రూపాయి అయినా అతను ఆశించడు.ఇదే క్రమంలో ఓరోజు ఓ వ్యక్తి సాక్సుల ధర కంటే రూ.50 అదనంగా ఇచ్చి తీసుకోమన్నాడు.అయితే వంశ్ సింగ్ మాత్రం మరో మాట లేకుండా వద్దన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కాస్త పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ దృష్టికి వెళ్లింది. వెంటనే సీఎం వంశ్ సింగ్ కుటుంబానికి వీడియో కాల్ చేసి అతనితో,కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

ఇంత చిన్న వయసులో వంశ్ సింగ్‌కు ఉన్న ఆత్మాభిమానాన్ని చూసి తాను ముగ్ధుడనయ్యానని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు. ఆ కుటుంబానికి రూ.2లక్షలు తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. భవిష్యత్తులోనూ అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. వంశ్ సింగ్‌ను మళ్లీ స్కూల్లో చేర్చే బాధ్యతను లూథియానా కలెక్టర్‌కు అప్పగించారు. అతని చదువుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్పందనపై ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. పదేళ్ల వయసులోనే ఎవరిపై ఆధారపడకుండా సాక్సులు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచిన వంశ్ సింగ్‌పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

Rapid Fever Survey : Telangana CS Surprise Inspection On The Service

English summary
A video of a 10-year old boy selling socks on roads in Ludhiana to support his family went viral Friday, following which Punjab Chief Minister Amarinder Singh made a video call to the child and also announced assistance for his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X