వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు ఫంక్షన్‌హాల్స్‌లో పెళ్లి వేడుకలు రద్దు, యోగి ప్రభుత్వం ఆదేశాలు, ఎందుకంటే?

|
Google Oneindia TeluguNews

లక్నో: వచ్చే ఏడాది కుంభమేళా సమయంలో ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు రద్దు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో (గతంలో అలహాబాద్) 2019 జనవరి నుంచి మార్చి వరకు పెళ్లిళ్లు జరగకూడదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రయాగ్‌రాజ్ జిల్లా యంత్రాంగం అన్ని ఫంక్షన్‌ హాళ్లు, అతిథి గృహాలు, హోటళ్లకు ఉత్తర్వులను పంపించింది. ముందస్తు బుకింగ్‌లను అన్నింటినీ రద్దు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ సమయంలో కుంభమేళా ఉన్న దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కుంభమేళాకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. దీంతో వారికి ఫంక్షన్ హాళ్లు, అతిథి గృహాల్లో బస ఏర్పాటు చేసేందుకే ప్రభుత్వం పెళ్లి వేడుకలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది పెళ్లి తేదీ వాయిదా వేసుకుంటున్నారు. మరికొంత మంది కల్యాణ వేదికను మరో చోటికి మార్చుకుంటున్నారు.

Chief Minister Yogi Adityanath issues ban on marriages during Kumbh Mela

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జనవరిలో కుంభస్నానాలు మొదలయ్యే ఒక రోజు ముందు నుంచి మార్చిలో కార్యక్రమం ముగిసే తర్వాతి రోజు వరకు పెళ్లిళ్ల వేడుకలు జరపకూడదు. కుంభమేళాలో భాగంగా దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో సాధువులు, మునులతో పాటు భక్తులు తరలి వస్తారు. ఈ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని గంగా నదిలో ఆరు రకాల స్నానాలు చేస్తారు. జనవరిలో మకర సంక్రాంతి, పుష్యమి పూర్ణిమ స్నానాలు, ఫిబ్రవరిలో మౌని అమావాస్య, బసంత్‌ పంచమి, మాఘీ పూర్ణిమ స్నానాలు, మార్చిలో మహా శివరాత్రి స్నానమాచరిస్తారు.

కుంభమేళాలో భాగంగా గంగా నదిని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంతో కాన్పూర్‌లోని తోళ్ల పరిశ్రమలన్నీ ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి వచ్చే ఏడాది మార్చి 15 వరకూ మూసివేయాలని యోగి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

English summary
You will have to postpone your wedding or shift the venue altogether if you’re planning your big day between January and March 2019 and happen to live in Uttar Pradesh’s Prayagraj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X