bengaluru blast PM modi CM cid reddy killed injured anantapur andhra pradesh karnataka bjp బెంగళూరు పేలుడు ప్రధాని మోదీ సీఎం సీఐడీ రెడ్డి మరణం గాయాలు అనంతపురం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బీజేపీ politics
Blast: జిలెటిన్ దెబ్బకు 6 మంది బలి, ఆంధ్రా అమాయకులు, సీఐడీ ఎంట్రీ, ప్రధాని, సీఎం!
బెంగళూరు/అనంతపురం: కర్ణాటకలో మరో పేలుడు జరగడంతో ఆరు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ సరఫరా చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ పేలుడు దెబ్బకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ఇద్దరు, నేపాల్ కు చెందిన ఒకరి ప్రాణాలు పోయాయి. నాగరాజ్ రెడ్డి అనే వ్యక్తి క్రషర్ కు అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ రవాణా చేస్తున్నారని వెలుగు చూసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, చిక్కబళ్లాపురంకు చెందిన మంత్రి సుధాకర్ తదితరులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. జిలెటిన్ స్టిక్స్ పేలుడు కేసును సీఐడీకి అప్పగిస్తున్నామని హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు.
Illegal affair: అత్త అక్రమ సంబంధం, అల్లుడు ఔట్, నో ఎంట్రీ టైమ్ లో బెడ్ రూమ్ !

ఒక్క దెబ్బతో ఆరు మంది
కర్ణాటకలోని చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండ తాలుకా హీరేనాగవేలి గ్రామం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న జిలెటిన్ స్టిక్స్ ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ప్రమాదంలో జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్న వారిలో ఆరు మంది అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషయంగా ఉండటంతో చిక్కబళ్లాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

పాపం ఆంధ్రావాసులు
జిలెటిన్ స్టిక్స్ పేలుడు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు, కర్ణాటకలోని హీరేనాగూరు నివాసి, బాగేపల్లి నివాసి, నేపాల్ కు చెందిన ఒకరి ప్రాణాలు పోయాయి. మృతులను పోలీసులు గుర్తించారు. రాము, మహేష్, మురళి, గంగాధర్, ఉమాకాంత్, అభి అనే ఆరు మంది ప్రాణాలు పోయాయని పోలీసులు అన్నారు.

అక్రమంగా క్రషర్ ?
నాగరాజ్ రెడ్డి అనే వ్యక్తి బ్రమరవాసి అనే క్రషర్ నిర్వహిస్తున్నాడు. నాగరాజ్ రెడ్డికి చెందిన క్రషర్ కు అక్రమంగా జిలెటిన్ స్టిక్స్ రవాణా చేస్తున్నారని, ఆ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. తప్పు చేసిన వాళ్లను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ఎవ్వరిని వదిలిపెట్టమని చిక్కబళ్లాపురం ఎమ్మెల్యే, మంత్రి సుధాకర్ స్పష్టం చేశారు. క్రషర్ యజమాని నాగరాజ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారని సమాచారం.

ప్రధాని, సీఎం సంతాపం
చిక్కబళ్లాపురంలో జిలెటిన్ స్టిక్స్ పేలుడు జరిగి ఆరు మంది ప్రాణాలు పోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని, ఎవ్వరినీ వదిలిపెట్టమని, ఇప్పటికే విచారణ మొదలైయ్యిందని సీఎం బీఎస్. యడియూరప్ప ట్వీట్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ వివరాలు సేకరించారు. చిక్కబళ్లాపురం జిలెటిన్ స్టిక్స్ పేలుడు కేసును సీఐడీకి అప్పగిస్తున్నామని హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు.

ప్రతిపక్షాలు ఫైర్
చిక్కబళ్లాపురంలో అక్రమ క్రషర్ ల దందా ఎక్కువ అయ్యిందని, కొందరు డబ్బు సంపాధించడం కోసం అమాయకుల జీవితాలను బలి తీసుకుంటున్నారని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. ఇటీవల శివమొగ్గలో ఇలాంటి దుర్ఘటన జరిగిందని, ప్రభుత్వం నిర్లక్షం కారణంగా వెంటనే చిక్కబళ్లాపురంలో మరో సంఘటన జరిగి ఆరు మంది అమాయకులు బలి అయ్యారని, ప్రభుత్వం నిర్లక్షం స్పష్టంగా కనపడుతోందని కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే. శివకుమార్ ఆరోపించారు.