Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Daughter: అమ్మాయి గ్యాంగ్ రేప్, 42 మంది అరెస్టు, కన్నతల్లి అక్రమ సంబంధాలతో ?, 30 చార్జ్ షీట్లు !

బెంగళూరు/ చిక్కమగళూరు: దక్షిణ భారతదేశంలో ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మైనర్ అమ్మాయి మీద జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటి వరకు 42 మంది అరెస్టు అయ్యారు. మైనర్ అమ్మాయి కన్న తల్లి అక్రమ సంబంధాలు పెట్టుకుని కూతురి జీవితాన్ని నాశనం చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. మైనర్ అమ్మాయి మీద జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటి వరకు 30 మంది మీద చార్జ్ షీట్లు నమోదు చేసిన పోలీసులు ఆ కేసును ఇంకా విచారణ చేస్తున్నారు. అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉందని వెలుగు చూడటం కలకలం రేపింది.

 దక్షణి భారతదేశంలోనే ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం

దక్షణి భారతదేశంలోనే ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం

దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ది చెందిన కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం శృంగేరి పట్టణంలో ఇదే సంవత్సరం జనవరి 30వ తేదీన 15 ఏళ్ల అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరిగిందని చాలా ఆలస్యంగా వెలుగు చూడటంతో కర్ణాటకను కుదిపేసింది. చిక్కమగళూరు జిల్లా అడిషనల్ ఎస్పీ శృతి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు టీమ్ లు అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసు విచారణ చేశారు. శృంగేరి గ్యాంగ్ రేప్ కేసును కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో పోలీసులు సైతం ప్రత్యేక శ్రధ్దతో విచారణ చేశారు.

 కిలాడి తల్లి రెండో పెళ్లి

కిలాడి తల్లి రెండో పెళ్లి

ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన సావిత్రి అనే మహిళ రెండు సంవత్సరాల క్రితం భర్తను వదిలేసి ఓ అమ్మాయితో కలిసి శృంగేరి పట్టణం చేరుకునింది. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా వేరే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న సావిత్రి అక్కడే కాపురం పెట్టింది. తన వెంట ఉన్నది తన అక్క కుమార్తె అని కట్టుకున్న రెండో భర్తతో పాటు చుట్టుపక్కల వాళ్లు అందర్నీ సావిత్రి నమ్మించింది

దెబ్బకు రెండో మొగుడు పరార్

దెబ్బకు రెండో మొగుడు పరార్

ఏడాది పాటు సావిత్రతో కాపురం చేసిన ఆమె రెండో మొగుడు ఆమె తీరుతో విసిగిపోయి అతనుకూడా జెండా ఎత్తేశాడు. రెండో భర్త వదిలేయడంతో సావిత్రి అమ్మాయితో కలిసి వేరుగా ఉంటోంది. తరువాత కొందరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న సావిత్రి కాలం గడుపుతోంది. ఇదే సమయంలో సావిత్రి ఇంట్లో ఉన్న మైనర్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ జరగడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

 సినిమా స్టోరీలు చెప్పిన సావిత్రి ఆంటీ

సినిమా స్టోరీలు చెప్పిన సావిత్రి ఆంటీ

పోలీసులు బాధితురాలైన 15 ఏళ్ల అమ్మాయి దగ్గర స్టేట్ మెంట్ తీసుకుని విచారణ చేశారు. ఇదే సమయంలో అమ్మాయి తన అక్క కూతురని, తన కూతురు కాదని సినిమా స్టోరీలు చెప్పిన సావిత్రి పోలీసులను నమ్మించడానికి ప్రయత్నించింది. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. సావిత్రి ఎక్కడి నుంచి శృంగేరికి వచ్చింది ?, మొగుడు ఎందుకు వదిలేశాడు ?, ఆమె ఇంటికి ఎవరెవరు వచ్చి వెలుతున్నారు ? అంటూ పూర్తి సమాచారం కొంచెం కొంచెం బయటకు లాగారు.

 పోలీసుల మైండ్ బ్లాక్

పోలీసుల మైండ్ బ్లాక్

చిక్కమగళూరు జిల్లా పోలీసుల విచారణలో సావిత్రి అమ్మాయికి చిన్నమ్మ కాదని, సొంత అమ్మ అని బయటపడింది. మొదటి భర్త, రెండో భర్త వదిలేయడంతో డబ్బు మీద ఆశపడిన సావిత్రం కొందరితో అక్రమ సంబంధాలు పెట్టుకుందని, చివరికి కన్న కూతురితో వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించిందని, అందుకు అమ్మాయి ఎదురు తిరిగితే యువకులను రెచ్చగొట్టి వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేసి కన్న కూతురి మీద అత్యాచారం చేయించిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

Recommended Video

    Vamika తండ్రి Virat Kohli గొప్ప నిర్ణయం.. Rohit, Dhoni కంటే భిన్నమైన నాన్న || Oneindia Telugu
     42 మంది కామాంధులు......30 చార్జ్ షీట్లు

    42 మంది కామాంధులు......30 చార్జ్ షీట్లు

    చిక్కమగళూరు జిల్లా శృంగేరిలో 15 ఏళ్ల అమ్మాయి గ్యాంగ్ రేప్, వరుస అత్యాచారాల కేసుల్లో ఇప్పటి వరకు 42 మందిని అరెస్టు చెయ్యడం కలకలం రేపింది. అమ్మాయి గ్యాంగ్ రేప్ కేసులో ఆమె తల్లి సావిత్రి ప్రధాన నిందితురాలని చిక్కమగళూరు జిల్లా అడిషనల్ పోలీసు కమిషనర్ శృతి చెప్పారు. ఇంకా ఈ కేసులో ఇప్పటి వరకు 30 చార్జ్ షీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా కొంత మంది అరెస్టు అయ్యే అవకాశం ఉందని వెలుగు చూడటం కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+