చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నారులతో అశ్లీల కార్యకలాపాలు చేయిస్తున్న వారిపై తమిళ పోలీసుల కొరడా

|
Google Oneindia TeluguNews

చెన్నై: చిన్నపిల్లలను పెట్టి పోర్న్ వీడియోస్ తీసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న మూడు గ్యాంగులను చెన్నై పోలీసులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 మంది చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు ఓ ప్రైవేట్ ఏజెన్సీ సహకారంతో తమిళనాడు పోలీస్ శాఖ సైబర్ సెల్ శాఖ గుర్తించింది. అంతేకాదు సైబర్ సెల్ ఆ ఐపీ అడ్రస్‌లను కూడా గుర్తించింది. అంతేకాదు ఈ పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని వాటిని వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో షేర్ చేసిన వారిని కూడా గుర్తించే పనిలో ఉన్నామని తమిళనాడు అడిషనల్ డీజీపీ రవి చెప్పారు.

పోర్న్ వీడియోలు చూస్తున్నాడంటూ ఓ యువకుడిని పోలీసు బెదిరించడం అనే వార్తలు రావడంపై స్పందించిన అడిషనల్ డీజీపీ రవి, అది ఫేక్ అని తేల్చేశారు. ఇప్పటి వరకు మూడు చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులను గుర్తించి ఇవి తయారు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించామని చెప్పారు. ఇక ఎవరైతే పోర్న్ వీడియో తీసి వాటిని డౌన్‌లోడ్ చేసి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారో వారిని గుర్తించి సంబంధింత జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చామని వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు మొబైల్ ఫోన్‌లపై నిఘా పెట్టామనేది అవాస్తవమని చెప్పారు.

Child Pornography: Three gangs under TN Police scanner for posting videos online

పోక్సో చట్టం ప్రకారం, ఐటీ చట్టం ప్రకారం చిన్నపిల్లలను అసాంఘీక కార్యకాలాపాల్లోకి దించడం నేరం. అంతేకాదు లైంగికపరమైన అంశాల్లోకి చిన్నపిల్లలను బలవంతంగా దించడమనేది నేరం. అంతేకాదు పోర్నోగ్రఫీకి అలవాటు పడినవారు అలాంటి వెబ్‌సైట్‌లను సందర్శిస్తే వారిపై నిఘా పెడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు అడిషనల్ డీజీపీ రవి. వారందరిపై నిఘా పెట్టడం సాధ్యం కాదని చెప్పిన రవి... పిల్లలను బలవంతంగా సెక్సువల్ యాక్టివిటీస్‌లోకి దించుతున్న వారిపై నిఘా పెడుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే మహిళలు చిన్నారులపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులను సమన్వయం చేసుకుని పనిచేసేలా నోడల్ అధికారిగా జయశ్రీ అనే ఎస్పీని నియమించినట్లు రవి చెప్పారు.

English summary
The Chennai police are monitoring at least three gangs that had created, stored and circulated videos of child sexual abuse online, according to a report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X