వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ననే కాదు చెల్లి కూడా..! "చౌకీదార్ చోర్ హై" వివాదంలో ప్రియాంక! వద్దంటే కూడా తప్పా?

|
Google Oneindia TeluguNews

లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు. అయితే ప్రియాంక ఎన్నికల ప్రచారంలో కొందరు చిన్నారులు చేసిన నినాదాలు ప్రియాంకా గాంధీకి చిక్కులు తెచ్చి పెట్టాయి . జాతీయ బాలల హక్కుల సంఘం ఆగ్రహానికి కారణం అయ్యాయి.

<strong>శ్రీలంకలో భారత ఫొటో జర్నలిస్టు సిద్దిఖి అరెస్ట్.... ఎందుకంటే</strong>శ్రీలంకలో భారత ఫొటో జర్నలిస్టు సిద్దిఖి అరెస్ట్.... ఎందుకంటే

ప్రియాంక ముందు చౌకీదార్ చోర్ హై అని నినాదాలు చేసిన చిన్నారులు .. తప్పని చెప్పిన ప్రియాంక

ప్రియాంక ముందు చౌకీదార్ చోర్ హై అని నినాదాలు చేసిన చిన్నారులు .. తప్పని చెప్పిన ప్రియాంక

అమేధీలో ప్రియాంకా గాంధీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో కనిపించిన కొందరు చిన్నారులు ‘చౌకీదార్ చోర్ హై' అని గట్టిగా నినాదాలు చేశారు . అయితే అది చూసిన ప్రియాంక వెంటనే వారి వద్దకు వెళ్లి అలా అనడం తప్పని వారిని వారించారు. మంచి మాటలు మాత్రమే మాట్లాడాలని, పిల్లలు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదంటూ వారి వద్దకు వెళ్లి హితవు పలికారు.

చిన్నారుల ప్రధాని వ్యతిరేఖ నినాదాల వీడియో వైరల్ .. బీజేపీ ఫైర్

అయితే ప్రియాంక ముందు చిన్నారులు ప్రధానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. పిల్లలకు కాంగ్రెస్ నేర్పించే భాష ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మృతీ ఇరాని ఈ వీడియో గా ఘాటుగా ట్వీట్ చేశారు.

 సీరియస్ అయిన జాతీయ బాలల హక్కుల సంఘం .. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు

సీరియస్ అయిన జాతీయ బాలల హక్కుల సంఘం .. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు

ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో చూసిన జాతీయ బాలల హక్కుల సంఘం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది .ఎన్‌సీపీఆర్‌సీ ఈ వ్యవహారంలో ప్రియాంకా గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలోకి పిల్లలను తీసుకురావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక చిన్నారుల నినాదాలపై , ఎన్నికల ప్రచారంలో చిన్నారులను తీసుకురావటంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిల్లల పేర్లు, పూర్తి వివరాలు, ఘటన ఎక్కడ జరిగిందీ అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎన్నికల సంఘం దృష్టికి కూడా జాతీయ బాలల హక్కుల సంఘం ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లింది.

English summary
The National Commission for Protection of Child Rights has issued a notice to Congress leader Priyanka Gandhi Vadra for the allegedly involving children in her election campaign, PTI reported. On Wednesday, the child rights body had written to the Election Commission after a video showed children shouting “derogatory remarks and using abusive language” in her presence.However, the video was clipped and it ends right before Vadra stopped the children from chanting the slogan. “Not this one, this one is not good. Only good ones, okay?” Vadra is heard saying in a longer version of the video clip.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X