• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేశభక్తులు..! టీచర్లంతా పరుగో పరుగు.. చిన్నారులు మాత్రం ఇంచుకూడా కదల్లేదు..!!(వీడియో)

|

మంగళూరు : పిల్లలు కల్లకపటం లేని వారు. కల్మషం లేని మనసు. పాలలాంటి స్వచ్ఛంగా ఉంటారు. అంతేకాదు వారిలో దేశభక్తి కూడా మెండు. యువత కంటే పిల్లల్లోనూ దేశం పట్ల అంకితభావం, గౌరవ ఉంటాయి. మంగళూరుకు చెందిన పిల్లల గురించి చెప్పక్కర్లేదు. వారే భావి భారత పౌరులు. తమ దేశం పట్ల, తమ జాతీయ పతాకం ఎగరవేసే సమయంలో చూపిన శ్రద్ధ, అంకితభావం ప్రతి ఒక్కరికి కట్టిపడేశాయి. జనగనమణ అదినాయక జయహే అంటూ వర్షం కురుస్తోన్న వారు మాత్రం వెరలేదు. అలాగే ఉండి జాతీయ గీతం పూర్తిచేశారు.'

సెల్యూట్ ..

సెల్యూట్ ..

రెండురోజుల క్రితం 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతూ ఎగిరింది. కానీ మంగళూరులో ఓ ప్రాథమిక కేంద్రంలో మాత్రం పిల్లలు చూపించిన దేశభక్తి కట్టిపడేసింది. ఉదయం జాతీయ జెండా ఎగరవేశారు. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూ ఎగిరింది. అయితే అప్పుడే జోరుగా వర్షం కురిసింది. అక్కడే ఉన్న అతిథులు పరుగుతీశారు. టీచర్లు కూడా వామ్మో అంటూ పరుగు తీశారు. కానీ పిల్లలు మాత్రం అక్కడే ఉన్నారు. వర్షానికి ఎదురొడ్డి నిలిచారు. జనగణమన అంటూ ఆలపిస్తూనే ఉన్నారు. జోరు వర్షంలోనూ వారు జెండాకు సెల్యూట్ చేస్తూనే ఉన్నారు. వర్షానికి వెరవలేదు. బెదరలేదు.

హ్యాట్సాప్ చైల్డ్ ..

హ్యాట్సాప్ చైల్డ్ ..

జనగణమన పూర్తిగా ఆలపించి, సెల్యూట్ కిందకి దించారు. అప్పుడే పాఠశాల కప్పు కింద ఉన్న టీచర్లు రమ్మని పిలిస్తే వెళ్లారు. అంతేతప్ప మిగతా వారి లాగా వర్షానికి భయపడలేదు. తమ చేయిని దించలేదు. నోటి నుంచి జనగణమన కొనసాగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆ చిన్నారుల దేశభక్తిని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. శెభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇలాంటి చిన్నారుల చేతుల్లో దేశ భవిష్యత్ భద్రంగా ఉంటుందని చెప్తున్నారు. జాతీయ జెండా, గీతాలాపన వారికున్న అంకితభావం, శ్రద్ధ, గౌరవాన్ని ప్రతి ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

గురవులా ..?

గురవులా ..?

జోరుగా వర్షం కురుస్తుంటే టీచర్లు, అతిథులు పరుగు తీశారు. జాతీయ జెండా, గీతాలాపనపై ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరించారు. వారి ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లలకు ఆదర్శంగా ఉండాల్సిన వీరు ఇలా చేశారేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఆ వీడియోలో వారు స్పష్టంగా కనిపించడంతో .. వారు చెప్పే సాకులు వినే పరిస్థితి లేదు. వారి వ్యవహరశైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ పిల్లల దేశభక్తి మాత్రం ప్రతి ఒక్కరి మది కదిలించింది. దేశం పట్ల, జాతీయ గీతం పట్ల, స్వాతంత్ర్య దినోత్సవంపై వారికున్న అచంచలమైన ప్రేమ, గౌరవం, అభిమానం స్పష్టంగా కనిపించాయి. అందుకే వారిని భావి భారత నిజమైన పౌరులు అంటున్నారు. జాతి యావత్ వారికి సెల్యూట్ చేస్తుంది.

English summary
Two days ago, the 73rd Independence Day celebration was held in grand style. From street to Delhi, flag hosting. But at a basic center in Mangalore, the patriotism of the children was hooked. In the morning the national flag flies. The thorns flag flew in flames. However, it was raining. The guests there were running out. Teachers have also run.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X