వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా ఆర్మీ చొరబాటు,నదీజలాల మళ్లింపు.. దీటుగా భారత్ ప్రతిఘటన.. కొనసాగుతోన్న చర్చలు..

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెటకొన్న టెన్షన్ ఇంకా తగ్గలేదు. రెండు దేశాల సైన్యాధికారులు చర్చోపచర్చలు జరుపుతున్నా.. అవి పరిష్కారం దిశగా సాగడంలేదు. రెండువైపులా బలగాల మోహరింపులు మంగళవారం కూడా కొనసాగాయి. ఈలోపే చైనా ఆర్మీ చొరబాట్లకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కొన్ని వెలుగులోకి రావడం కలకలంగా మారింది. భారత భూభాగంలోని గాల్వాన్ లోయలో చైనీస్ ఆర్మీ రెండు వారాలపాటు తిష్టవేసి, గాల్వాన్ నదీ జలాలను మళ్లించినట్లు ఆ చిత్రాల్లో వెల్లడైంది. చర్చలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక విషయాలను వెల్లడించారు.

Recommended Video

India China Dispute, Galwan Waters Issue || భారత భూభాగంలోని గాల్వాన్ నదీ జలాలను చైనా మళ్లించిందా ?

మళ్లీ సీఎంగా చంద్రబాబు, ఇదీ పథకం.. టీడీపీకి ఉప్పందించిన విజయసాయి వేగులు.. ఇందుకే ఢిల్లీ టూర్ రద్దు..మళ్లీ సీఎంగా చంద్రబాబు, ఇదీ పథకం.. టీడీపీకి ఉప్పందించిన విజయసాయి వేగులు.. ఇందుకే ఢిల్లీ టూర్ రద్దు..

ఆ రెండు ప్రాంతాల్లో..

ఆ రెండు ప్రాంతాల్లో..

తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు, గాల్వాన్ లోయలో గడిచిన నెల రోజులుగా ఉద్రిక్తత నెలకొంది. చైనీస్ ఆర్మీ మన భూభాగంలోకి ప్రవేశించినట్లు సైన్యంగానీ, కేంద్రంగానీ అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. రక్షణ శాఖ వర్గాలు వెల్లడించినట్లుగా చెబుతూ ప్రఖ్యాత ‘ది ప్రింట్' మీడియా సంస్థ కొన్ని ఆధారాలను, శాటిలైట్ చిత్రాలను ప్రచురించింది. వాటిప్రకారం.. మే మొదటి వారం నుంచి నాలుగో వారం దాకా 50కిపైగా చైనా సైనిక బృందాలు గాల్వాన్ లోయలో కార్యకలాపాలు నిర్వహించాయి. గాల్వాన్ నదిపై భారత్ వంతెన నిర్మించాలనుకుంటుండగా.. డ్రాగన్ ఏకంగా ఆ నదీ జలాలనే మళ్లించినట్లు వెల్లడైంది.

ప్రశ్నించకుంటే ప్రమాదం..

ప్రశ్నించకుంటే ప్రమాదం..


గల్వాన్ నదీ జలాల మళ్లింపుపై వెంటనే చైనాను సవాలు చేయకుంటే రాబోయే రోజుల్లో అది తన భూభాగంలోని మిగతా జలప్రవాహాలకూ అడ్డుకట్ట వేసే ప్రమాదముందని, తద్వారా భారత్ తీవ్రంగా నష్టపోతుందని ‘ది ప్రింట్' కథనంలో పేర్కొన్నారు. నిజానికి భారత్-చైనాల మధ్య నదీ జలాల వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం చైనా నుంచి ఆ దేశ భూభాగం బయటికి వెళ్తున్న మొత్తం నదీ జలాల పరిమాణం 718 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం)కాగా.. అందులో 48 శాతం ఒక్క భారతదేశంలోకే ప్రవహిస్తున్నాయి. ఎగువన ఉన్న చైనా ఇప్పటికే.. భారతదేశానికి కీలకమైన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లెజ్నదులపై అడ్డగోలుగా అక్రమ ప్రాజెక్టులు నిర్మించింది. భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ.. చైనా తన హక్కును మాత్రమే వాడుకుంటున్నట్లు బుకాయిస్తోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో గాల్వాన్ జలాల మళ్లింపుతో డ్రాగన్ దుశ్చర్య మరోసారి బహిర్గతమైంది.

సడలని ఉద్రిక్తత.. ఆగని చర్చలు..

సడలని ఉద్రిక్తత.. ఆగని చర్చలు..

సరిహద్దులో రెండు దేశాలూ పోటాపోటీగా బలగాల మోహరింపును పెంచుతూ పోతుండటంతో ఉద్రిక్తతలు ఎంతకీ తగ్గడంలేదు. అయితే చైనాతో ఇలాంటి టెన్షన్ ఇది మొదటిసారేమీ కాదు, మూడేళ్ల క్రితం డోక్లాంలో ఏకంగా 73 రోజులపాటు స్టాండాఫ్ కొనసాగింది. ప్రస్తుతం కూడా భారత్ శాంతినే కోరుతున్న దరిమిలా ఈనెల 6వ తేదీన ఇరు వైపుల సైన్యాధికారులు మరోసారి భేటీ కానున్నారు.దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి చైనా సరిహద్దుకు సైనికులను తరలిస్తున్న నేపథ్యంలో నార్తన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి మంగళవారం లదాక్ వెళ్లి, కీలక రివ్యూలు నిర్వహించారు.

వెనక్కి తగ్గని భారత్..

వెనక్కి తగ్గని భారత్..

తూర్పు లదాక్ లోని దర్బూక్-షోయక్-దౌలత్ బేగ్ ఓల్డీ (డీబీఓ) మధ్య భారత్ నిర్మించిన 255 కిలోమీటర్ల రోడ్డు అక్రమమని, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని వాదిస్తోన్న చైనా.. గడిచిన 30 రోజులుగా సరిహద్దు వెంబడి పలు ప్రాంతాల్లో భారత కార్యకలాపాలకు అడ్డుతగులుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. మన భూభాగంపై చైనా ఆరోపణల్ని తిప్పికొడుతోన్న సైన్యాలు.. మౌలికవసతుల నిర్మాణాలను యధావిధిగా కొనసాగిస్తున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో పెండింగ్ లో ఉన్న రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం జార్ఖండ్ నుంచి 12వేల మంది కార్మికులను తరలించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఎల్ఏసీ వెంబడి చైనా భారీగా సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని పోగుచేయడంతో భారత్ సైతం అదే స్థాయిలో రెడీ అవుతోంది. సరిహద్దులో చైనా దూకుడును అమెరికా సహా ప్రపంచ దేశాలు తప్పపడుతున్న సంగతి తెలిసిందే.

రాఫెల్ జెట్స్ వస్తున్నాయ్..

రాఫెల్ జెట్స్ వస్తున్నాయ్..


కరోనా ప్రభావం ఉన్నప్పటికీ భారత్ కు రఫేల్ యుద్ధ విమానాలను త్వరలోనే అందజేస్తామని ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లారెన్స్ పార్లె చెప్పినట్లు మన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. మంగళవారం ఫ్రాన్స్ మంత్రితో ఫోన్లో జరిపిన సంభాషణ వివరాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. మే నెలాఖరుకే 4 రఫేల్ విమానాలు చేరాల్సి ఉన్నప్పటికీ, కరోనా లాక్ డౌన్ కారణంగా అది సాధ్యపడలేదని, జులై చివరిలోగా వాటిని అందజేస్తామని ఫ్రాన్స్ మంత్రి స్పష్టం చేసినట్లు తెలిపారు. పొరుగుదేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం ఈ విమానాలను వచ్ఛే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశాలున్నాయని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు.

English summary
China Has Sent Large Number of Troops to Border, Won’t be Right to Assign Motives Amid Talks says Rajnath Singh. Chinese intrusion in Galwan lasted for two weeks before it was cleared by Indian troops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X