వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో కుట్రకు తెరతీసిన చైనా- అరుణాచల్‌ సరిహద్దు వరకూ రైల్వేలైన్‌ నిర్మాణం ప్రారంభం

|
Google Oneindia TeluguNews

భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభన తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు ఓ పక్క నటిస్తూనే మరోవైపు కుట్రలకు చైనా తెరదీస్తోంది. సిల్క్‌ రూట్ వెంబడి భారత్‌ నిర్మిస్తున్న రోడ్డు మార్గంపై గుర్రుగా ఉన్న చైనా.. ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌ సమీపంలో కొత్తగా రైలు మార్గం నిర్మాణం ప్రారంభించడం ఆందోళన రేపుతోంది. చైనాను టిబెట్‌తో కలుపుతూ నిర్మిస్తున్న రెండో అతిపెద్ద రైలు మార్గం ఇది.

Recommended Video

India-China Stand Off : China Begins Work On Railway Up To Arunachal Border

చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ను- నయింగ్చీని కలుపుతూ ఓ కొత్త రైలు మార్గం నిర్మాణాన్ని చైనా ప్రారంభించింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ తో ఏడు నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగిస్తున్న చైనా.. ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్ నుంచి ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. లడఖ్‌లో ఇరుదేశాల మధ్య నిరాయుధీకరణ, శాంతికి ఒప్పందం కుదిరి వారం రోజులు కూడా గడవక ముందే అరుణాచల్‌ ప్రదేశ్‌ సమీపంలో రైలు మార్గం నిర్మాణం ప్రారంభించడం ద్వారా చైనా కొత్త కుట్రలకు తెరదీసింది.

China begins work on railway up to Arunachal Pradesh border

జాతిని ఐక్యం చేయడంలో ఈ రైల్వే ప్రాజెక్టు ఓ ప్రధాన దశ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్ధిక ప్రోత్సాహానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. 2006లో లాసా నుంచి హింటర్‌లాండ్‌ను కలిపే క్వింఘాయ్‌-టిబెట్‌ రైల్వే లైన్‌ తర్వాత ఇదో అతి ముఖ్యమైన ప్రాజెక్టు అని చైనా నిపుణులు చెబుతున్నారు. భారత్‌ సరిహద్దుల్లోని నియింగ్చి వరకూ చైనా దీన్ని నిర్మిస్తోంది. చెంగ్డూ నుంచి లాసా వరకూ సాగే ఈ ప్రాజెక్టు టార్‌, సిచువాన్‌ యొక్క రెండు రాజధానులను కలుపుతుంది. దీని నిర్మాణం పూర్తయితే ప్రయాణ దూరం కూడా 48 గంటల నుంచి 13 గంటలకు తగ్గిపోనుంది.

English summary
China has begun work on a strategically significant railway line - its second major rail link to Tibet - that will link Sichuan province with Nyingchi, which lies near the border with India’s Arunachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X