వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో భారీగా చైనా యుద్ధ విమానాలు.. మళ్లీ ఏం జరగబోతోంది!?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మళ్లీ ఏదో ప్లాన్‌లో ఉంది. భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ విమానాలను మోహరించింది. ఈ విషయాన్ని రష్యాకు చెందిన పత్రిక స్పుత్నిక్ వెల్లడించింది. భారత్, చైనా సరిహద్దులో పరిస్థితి ఉత్కంఠగానే ఉందని కూడా ఆ పత్రిక పేర్కొంది.

హిమాలయ పర్వత్రశ్రేణుల్లో చైనా సైత్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తన ఫైటర్ జెట్లను సంసిద్ధంగా ఉంచినట్లు ఒక కథనంలో పేర్కొంది. చెంగ్డూ జే-10 విగోరస్ డ్రాగన్ మల్టీరోల్ ఫైటర్స్, షెన్‌యాంగ్ జే-11 ఫైటర్లు భారత్, చైనా సరిహద్దు సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్, పాక్, మధ్య.. అణుయుద్ధం జరుగుతుందా? పశ్చిమ దేశాల్లో టెన్షన్!?భారత్, పాక్, మధ్య.. అణుయుద్ధం జరుగుతుందా? పశ్చిమ దేశాల్లో టెన్షన్!?

 China boosts its offensive capabilities, deploys advanced fighter jets on border with India

అంతేకాదు, పశ్చిమ చైనా ప్రాంతంలో ఆ యుద్ధ విమానాలతో డ్రాగన్ కంట్రీ సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు కూడా చైనాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. ఇది ముందు జాగ్రత్త చర్య అని, ఒకవేళ భారత్‌తో యుద్ధమే గనుక తలెత్తితే ఆ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫైటర్ జెట్లను మోహరించినట్లు చైనా ఆర్మీ నిపుణుడు స్పుత్నిక్‌ పత్రికతో చెప్పారు.

భారత్ తన దగ్గర ఉన్న సుఖోయ్ 30 ఎంకేఐ లాంగ్ రేంజ్ ఫైటర్లను సరిహద్దులో మోహరించినట్లు చైనా పేర్కొంది. సరిహద్దు వెంట భారత్ తన సైన్యాన్ని ఎలా సమాయత్తం చేస్తుందో, అదే తరహాలో తాము కూడా తమ మిలిటరీని పటిష్టం చేస్తున్నట్లు ఆ అధికారి పేర్కొనడం గమనార్హం.

English summary
China's plan to deploy advanced fighter jets on the borders with India is likely to trigger a fresh showdown with New Delhi, according to a report in Sputnik.The report claims that China's People’s Liberation Army Air Force (PLAAF) has boosted its high-altitude capacities along the country's southwestern borders by sending more top-of-the-line jet fighters to the area. Earlier this month, PLAAF had published photos of Chengdu J-10 Vigorous Dragon multirole fighters and Shenyang J-11 (a modified version of the famous Soviet Sukhoi Su-27) air superiority fighters participating in combat training exercises in western China.A PLA expert Song Zhongping had told the state-owned Global Times that the purpose of deploying additional fighter jets is to boost Chinese military strength in case of conflict against India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X