వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాకు డ్రాగన్ షాక్: డోక్లామ్‌లో రోడ్డు, ఆర్మీ క్యాంప్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఇండియాకు డ్రాగన్ షాక్.. డోక్లామ్‌లో రోడ్డు, ఆర్మీ క్యాంప్

న్యూఢిల్లీ: డోక్లామ్‌లో సైనిక స్థావరాన్ని చైనా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు శాటిలైట్ చిత్రాలు రుజువు చేస్తున్నాయి. భారత్ ను దొంగ దెబ్బేందుకు చైనా ప్రయత్నాలను చేస్తోందని ఈ చిత్రాల ద్వారా తెలుస్తోందని రక్షణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇండియాకు డ్రాగన్‌ షాక్: సియాచిన్ సమీపంలో 36 కి.మీ రోడ్డు నిర్మాణంఇండియాకు డ్రాగన్‌ షాక్: సియాచిన్ సమీపంలో 36 కి.మీ రోడ్డు నిర్మాణం

భారత్ ను దెబ్బతీసేందుకు ప్రతి అవకాశాన్ని చైనా ఉపయోగించుకొంటుంది. ఇందులో భాగంగానే డోక్లామ్ ఉదంతాన్ని ఉపయోగించుకొంది. అయితే ఆ సమయంలో ఇండియా ఆర్మీ అప్రమత్తంగా వ్యవహరించింది.

ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి పూనుకొంది. అయితే ఈ విషయమై భారత్ సామాగ్రిని స్వాధీనం చేసుకోవడంతో చైనా ఆ ప్రయత్నాన్ని విరమించుకొంది.మరో వైపు సియాచిన్ వద్ద కూడ చైనా 36 కి.మీ. దూరంలో రోడ్డు నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఈ విషయం శాటిలైట్ చిత్రాలు వెల్లడించాయి.

 డోక్లామ్ వద్ద రోడ్డు నిర్మాణానికి చైనా రెడీ

డోక్లామ్ వద్ద రోడ్డు నిర్మాణానికి చైనా రెడీ

డోక్లామ్ వద్ద రోడ్డు నిర్మాణానికి చైనా రెడీ అవుతోందని శాటిటైల్ చిత్రాలు బట్టబయలు చేశాయి.డోక్లామ్ ప్రాంతంలోనే సైనిక స్థావరాన్ని నిర్మించింది. అత్యంత పకడ్బందీగా నిర్మించిన ఈ సైనిక స్థావరం ఆనవాళ్లను శాటిలైట్లు గుర్తించాయి.

 వివాదాస్పద స్థలానికి 10 కి.మీ. దూరం

వివాదాస్పద స్థలానికి 10 కి.మీ. దూరం

భూటాన్ భూభాగంలోని డోక్లాం ప్రాంతం తమదే అంటూ చైనా కొంతకాలంగా వాదిస్తోంది. తాజాగా డోక్లాం వివాదాస్పద ప్రాంతానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే సైనిక స్థావరంతోపాట, రహదారులను నిర్మించింది. అంతేకాదు హెలీపాడ్‌, కందకాలను, గన్‌ పాయింట్లను చైనా నిర్మించింది. ఈ రహదారిలో పదుల సంఖ్యలో ప్రయాణిస్తున్న ఆయుధ వాహనాలను శాటిలైట్‌ గుర్తించింది.

 సొరంగాలు నిర్మించిన చైనా

సొరంగాలు నిర్మించిన చైనా

వివాదాస్పద భూభాగానికి కేవలం 400 మీటర్ల దూరంలో చైనా పలు సొరంగాలను నిర్మించింది. అంతేకాదు సైనికులకు బారక్స్‌ని నిర్మించినట్లు శాటిలైట్‌ ఫొటోలు స్పష్టం చేస్తున్నాయి. సిక్కింలోని డోక్లామ్‌ పోస్ట్‌కు కేవలం 81 మీటర్ల దూరంలో ఈ మిలటరీ కాంప్లెక్స్‌ ఉంది.

ఇండియా లక్ష్యంగా చైనా ప్రయత్నాలు

ఇండియా లక్ష్యంగా చైనా ప్రయత్నాలు

ఇండియాను లక్ష్యంగా చేసుకొని చైనా ప్రయత్నాలను సాగిస్తోంది. ఈ మేరకు కొంత కాలంగా వ్యూహత్మకంగా చైనా ఈ ప్రయత్నాలను చేస్తోంది. ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకొనేందుకు చైనా ప్రయత్నాలను చేస్తోంది. ఇండియాలోకి చొరబడేందుకు అనుకూలమైన మార్గాల్లో చైనా రోడ్లను, సైనికుల స్థావరాలను ఏర్పాటు చేసింది.

English summary
Months after Indian and Chinese troops disengaged after a standoff situation on the Doklam plateau of Bhutan, China is building a full-fledged military complex within the disputed region, show new satellite images accessed by various media houses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X