వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా వారసుడిని ప్రకటించే హక్కు ఆదేశానికి లేదు: దలైలామా

|
Google Oneindia TeluguNews

Recommended Video

టిబెట్ ప్రజలే నా వారసున్ని ఎన్నుకుంటారు దలైలామా | China Can Never Decide My Successor Says Dalailama

న్యూఢిల్లీ: తన వారసుడిని టిబెట్ ప్రజలే నిర్ణయిస్తారు తప్ప చైనా కాదని తేల్చి చెప్పారు ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధగురువు దలైలామా. దలైలామా తర్వాత ఆయన వారుసుడు ఎవరనేది చైనాలోనే నిర్ణయం జరగాలని ఆదేశ అధికారులు చెప్పిన నేపథ్యంలో దలైలామా స్పందించారు. ఒకవేళ భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకుంటే చైనాకు భారత్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని డ్రాగన్ కంట్రీ మరో విషప్రచారం మొదలు పెట్టింది.

1959లో టిబెట్‌లో బౌద్ద మతస్తులపై స్థానికులు అణిచివేత తిరుగుబాటుతో 14వ దలైలామా తెన్జిన్ గ్యాట్సో భారత్‌కు వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందారు. భారత్ అతనికి రాజకీయ ఆశ్రయం కల్పించింది.ఇక అప్పటి నుంచి ధర్మశాల ప్రధానకేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దలైలామాకు 84 ఏళ్లు. వయస్సు మీద పడుతున్న సమయంలో ఆయన వారసుడు ఎవరుంటారో అనేదానిపై చర్చ జరుగుతోంది. ఇక దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం చైనాకే ఉండేలా చర్యలు తీసుకోవాలని కొందరు చైనా సీనియర్ ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. చైనాకు ఘనమైన బౌధ చరిత్ర ఉన్నందున ఈ సారి అవకాశం చైనాకే దక్కాలని భావిస్తున్నారు.

China can never decide my successor,says Dalailama


దలైలామా వారసుడిని ప్రకటించడమంటే ఒక చరిత్ర అని అంతేకాదు మతపరమైన, రాజకీయపరంగా ఈ అంశం వివాదంగా మారే అవకాశం ఉంది. దలైలామా వారసుడిని ప్రకటించాలంటే కొన్ని చారిత్రాత్మక ఇన్స్‌టిట్యూషన్లు, అధికారిక లాంఛనాలు ఉంటాయని టిబెట్ మంత్రి నెన్‌షెంగ్ చెప్పారు.దలైలామా వారసుడిని ఆయన చెబితేనో లేక ఇతర దేశాల్లో ఉంటున్న కొందరు చెబితేనో అయ్యేది కాదని అన్నారు. టిబెట్ అటానమస్ రీజియన్‌లో డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వాంగ్ దలైలామాను బీజింగ్‌లోనే గుర్తించామని, అతని వారసుడిని కూడా చైనాలోనే నిర్ణయం జరగాలని అదికూడా లాటరీ పద్ధతి ద్వారా జరగాలని డిమాండ్ చేశారు.

English summary
Tibetan spiritual leader Dalai Lama has slammed China for raking up his successor issue and has said his successor will be decided by the people of Tibet.Talking about his successor, Chinese authorities said the same has to be decided within China. If India tries to interfere, it will impact bilateral ties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X