వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్ష్యాలు ఇవిగో..! కరోనా వైరస్ ను సృష్టించింది చైనా నే..! స్పష్టం చేసిన జపాన్..!!

|
Google Oneindia TeluguNews

టోక్యో/హైదరాబాద్ : కరోనా వైరస్ ఆవిర్బావం, దాని విస్తరణ గురించి భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా మహమ్మారి గురించి జరుగుతున్న చర్చలో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుక గురించి జరుగుతున్న చర్చలో ప్రపంచ దేశాలు నెవ్వర పోయే అంశాలు తెర మీదకు వస్తున్నాయి. కరోనా వైరస్ సహజంగా పుట్టుకొచ్చింది కాదని, ఈ ప్రాణాంతక మహమ్మారిని చైనా దేశమే సృష్టించి ప్రపంచ దేశాల మీదకు వదిలిందని నోబెల్ బహుమతి గ్రహిత, జపాన్ వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ తసుకు హోంజో ఆధారాలతో సహా వెల్లడిస్తున్నారు.

Recommended Video

Coronavirus Created By China And Left To The World Says Scientist
 కరోనా వైరస్ ఆవిర్భావంపై విస్మయానికి గురిచేసే అంశాలు.. భయంకర విషయాన్ని బయటపెట్టిన జపాన్..

కరోనా వైరస్ ఆవిర్భావంపై విస్మయానికి గురిచేసే అంశాలు.. భయంకర విషయాన్ని బయటపెట్టిన జపాన్..

కరోనా వైరస్ చైనా దేశం నుండి వ్యాప్తి చెందిందని జరుగుతున్న చర్చను వ్యతిరేకించడంలో గాని, దృవీకరించడంలో గాని మీన మేషాలు లెక్కిస్తోన్న చైనా ఇప్పటివరకు చేస్తున్న వాదనలో పసలేదని తేలిపోయింది. ఇన్నాళ్లు అమెరికా చేస్తున్న వాదనకు జపాన్ శాస్త్రవేత్త అనుకూలంగా స్పందించడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ప్రపంచ దేశాలు విస్మయానికి గురయ్యే కొత్త అంశాలను ఆవిష్కరించారు జసాన్ శాస్త్రవేత్త. కరోనా వైరస్ సహజంగా జన్మించి ఉంటే యావత్ ప్రపంచాన్ని ఒకే రకంగా అతలాకుతలం చేసి ఉండేదని, కాని ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్దంగా ఉన్నాయని సదరు జసాన్ శాస్త్రవేత్త స్పష్టం చేస్తున్నారు.

 కరోనా వైరస్ సమజంగా పుట్టింది కాదు.. చైనా కృత్రిమంగా తయారు చేసిందన్న జపాన్ శాస్త్రవేత్త..

కరోనా వైరస్ సమజంగా పుట్టింది కాదు.. చైనా కృత్రిమంగా తయారు చేసిందన్న జపాన్ శాస్త్రవేత్త..

అంతే కాకుండా వివిధ దేశాల ఉష్ణోగ్రతలను బట్టి వైరస్ ప్రభావం వేరు వేరుగా ఉండేది. ఇది సహజంగా ఉంటే, ఇది చైనాతో సమానమైన ఉష్ణోగ్రత ఉన్న దేశాలను మాత్రమే ప్రతికూలంగా ప్రభావితం చేసి ఉండేది. కానీ ఈ వైరస్ స్విట్జర్లాండ్, జర్మనీ వంటి శీతల దేశాలను సైతం విపరీతంగా ప్రభావితం చేస్తోంది, శర వేగంగా వ్యాప్తి చెందుతోంది. అదే సమయంలో వేడి ఎక్కువగా ఉండే దేశాలలో సైతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని డాక్టర్ తసుకు హోంజో చెప్పుకొస్తున్నారు. జంతువులు, వైరస్‌లపై గత నలభై సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నానని, కరోనా వైరస్ ఖచ్చితంగా సహజమైనది కాదని, ఇది ముమ్మాటికి తయారు చేయబడిందని, ఈ వైరస్ పూర్తిగా కృత్రిమంగా రూపొందించబడిందని డాక్టర్ తసుకు హోంజో చెప్పుకొస్తున్నారు.

 అమెరికాకు వంత పాడిన జపాన్.. ఏకాకి అవుతున్న చైనా..

అమెరికాకు వంత పాడిన జపాన్.. ఏకాకి అవుతున్న చైనా..

అంతే కాకుండా డాక్టర్ తసుకు హోంజో చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో నాలుగు సంవత్సరాలు పనిచేసిన అనుభవాన్ని కూడా వివరించారు. ఆ ప్రయోగశాలలో పనిచేసే సిబ్బంది అందరితో పరిచయం ఉందని, కరోనావైరస్ కనిపించిన తరువాత వారందరినీ తాను ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం చేయగా వారి ఫోన్‌లన్నీ గత మూడు, నాలుగు నెలలుగా స్పందించడం మానేసాయని చెప్పుకొచ్చారు. అంటే ఈ ల్యాబ్ లో పనిచేసిన టెక్నీషియన్లందరూ కరోనా వైరస్ బారిన పడి చనిపోయారని అర్థమవుతోందంటూ ఆయన సంచలన విషయాలను మీడియాతో పంచుకున్నారు.

 కరోనా చైనా సృష్టించింది కాదని నిరూపిస్తే నోబుల్ వెనక్కి ఇస్తా.. సవాల్ విసురుతున్న జసాన్ శాస్త్రవేత్త

కరోనా చైనా సృష్టించింది కాదని నిరూపిస్తే నోబుల్ వెనక్కి ఇస్తా.. సవాల్ విసురుతున్న జసాన్ శాస్త్రవేత్త

అంతే కాకుండా వైరస్ పుట్టుక గురించి చైనా అసత్యాలు ప్రచారం చేస్తోందన్న విషయం త్వరలోనే ప్రపంచానికి అర్థమవుతుందని జపాన్ వైద్య శాస్త్రవేత్త స్పష్టం చేస్తున్నారు. కరోనా వైరస్ సహజమైనది కాదని, ఇది గబ్బిలాల వ్యాప్తి చెందలేదన్న అంశం అబద్ధమని నిరూపిస్తే తనకు వచ్చిన నోబెల్ బహుమతి రద్దుకు సమ్మతిస్తానని డాక్టర్ తసుకు హోంజో సవాల్ విసురుతున్నారు. ఇన్నాళ్లు అమెరికా చేస్తున్న వాదనకు జపాన్ మద్దతు కూడా లభించడంతో చైనా ఇరుకున పడింది. వైరస్‌ను ప్రపంచం మీదికి వదిలిన చైనా దేశం క్రమంగా ఏకాకిగా మారుతోంది. రాబోవు రోజుల్లో చైనా మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

English summary
In the ongoing debate about the birth of the corona virus, the world is moving on.Nobel laureate and professor of Japanese medicine, Dr. Tasaku Honzo, has revealed that the coronavirus was not a natural infection and that the deadliest pandemic was created by China and left to the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X