వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: భారత్ భూగంలో చైనా గ్రామం -అరుణాచల్ సరిహద్దు ఇవతల నిర్మాణం -శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టు

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి గడిచిన 10 నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలుత లదాక్ లో హింసాత్మక చర్యలకు పాల్పడిన డ్రాగన్ బలగాలు.. శీతాకాలం ప్రారంభం నుంచే అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో అలజడికి సిద్ధమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ ను తనదిగా చెప్పుకునే చైనా.. ఇప్పుడు ఏకంగా భారత భూభాగాన్ని ఆక్రమించేసి, కొత్త గ్రామాలను నిర్మించింది. శాటిలైట్ చిత్రాల్లో బయటపడిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే..

unnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టుunnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టు

4.5కిలోమీటర్లు లోనికి చొచ్చుకొచ్చి..

4.5కిలోమీటర్లు లోనికి చొచ్చుకొచ్చి..

చైనా మరోసారి బరి తెగించింది. విస్తరణవాదంతో చెలరేగుతున్న డ్రాగన్ దేశం.. మన భూభాగంలో ఓ గ్రామం నిర్మించిందని 'ఎన్డీటీవీ' సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అయింది. అరుణాచల్‌ప్రదేశ్ వద్ద సరిహద్దుకు 4.5 కిలోమీటర్ల లోపల భారత్ భూభాగంలో ఈ నిర్మాణాలు చేపట్టినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా కథనాన్ని రాశారు. సరిగ్గా..

 101 ఇళ్లతో కొత్త గ్రామం..

101 ఇళ్లతో కొత్త గ్రామం..

అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సుబన్ సిరి జిల్లాలో గల వివాదాస్పద ప్రాంతంలో చైనా బలగాలు ఏకంగా 101 ఇళ్లు నిర్మించినట్టు తెలుస్తోంది. భారత్ భూభాగమైన ఈ ప్రాంతాన్ని చైనా అనేక మార్లు తమకు చెందినదేనంటూ ప్రకటించింది. గతంలో ఇక్కడ పలు మార్లు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చైనా ఈ గ్రామం నిర్మించినట్టు శాటిలైట్ చిత్రాల ఆధారంగా నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 2019 నాటి చిత్రాలతో పోలిస్తే.. గతేడాది నవంబర్‌లో ఈ ప్రాంతంలో ఏకంగా 101 నిర్మాణాలు కనిపించాయి. దీన్ని బట్టి గతేడాదే ఈ గ్రామం ఏర్పాటైనట్టు నిపుణులు అంచనా వేస్తున్నారంటూ 'ఎన్డీటీవీ' కథనంలో పేర్కొంది. అయితే..

భారత్ స్పందన ఇది..

భారత్ స్పందన ఇది..

అరుణాచల్ సరిహద్దును ఆక్రమించిమరీ చైనా కొత్త గ్రామాన్ని నిర్మిచిన విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ కచ్చితంగా ఖండించకపోవడం గమనార్హం. ''సరిహద్దు వద్ద వివాదాస్పద ప్రాంతాల్లో చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నదన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయితే..చైనా గతంలోనూ అనేక పర్యాయాలు ఇటువంటి చర్యలకు పూనుకుంది'' అని మాత్రమే విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. భారత్ కూడా సరిహద్దు వెంబడి మౌలిక వసతులు అభివృద్ధి చేస్తోందని, సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు నిర్మాణాం చేపడుతోందని ఆ శాఖ పేర్కొంది. కాగా..

 బీజేపీ ఎంపీ ఆందోళన చేసినా..

బీజేపీ ఎంపీ ఆందోళన చేసినా..

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా దురాక్రమణలకు సంబంధించి స్థానిక బీజేపీ ఎంపీ ఏడాది కాలంగా ఆందోళనలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతేడాది నవంబర్‌లోనే చైనా దుశ్చర్యలపై అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీ టాపిర్ గావ్.. కేంద్రాన్ని హెచ్చరించారు. ఇవాళ చైనా గ్రామం బయటపడిన ఎగువ సుబన్ సిరి జిల్లా గురించే ఆయన ప్రముఖంగా ప్రస్తావించి ఉండటం గమనార్హం. బీజేపీ ఎంపీ ఆందోళన చెందిననట్లుగానే అక్కడ చైనా గ్రామం వెలిసి ఉండటం విశేషం. ''ఇప్పటికీ అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సరిహద్దుకు దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర భారత భూభాగంలోకి చైనా చొచ్చుకు వచ్చింది. నది వెంబడి వెళితే..ఈ విషయం స్పష్టమవుతుంది. స్థానికంగా లెన్సీ అని పిలిచే ఓ నది వెంబడి చైనా ఓ రోడ్డు కూడా నిర్మిస్తోంది'' అని బీజేపీ ఎంపీ టాపిర్ గావ్ వ్యాఖ్యానించిన విషయాన్ని కూడా 'ఎన్డీటీవీ' ప్రస్తావించింది. అంతేకాదు..

 ఒప్పందాలను విస్మరించిన డ్రాగన్..

ఒప్పందాలను విస్మరించిన డ్రాగన్..

చైనా ఆక్రమణలకు సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీతోపాటు పలువురు నిపుణుల అభిప్రాయాలను కూడా కథనంలో పొందుపర్చారు. ఎగువ సుబన్ సిరి జిల్లాలో వెలసిన చైనా గ్రామం.. వాస్తవాధీన రేఖకు దిగువగా ఉందని, ఇదో వివాదాస్పద ప్రాంతమని, సరిహద్దుకు సమీపంలోని ఇతర ప్రాంతాలపై ఈ చర్య తీవ్ర పరిణామం చూపిస్తుందని భారత్ -చైనా వ్యవహారాల నిపుణులు క్లాడ్ ఆర్పీ వ్యాఖ్యానించారు. సరిహద్దు వివాదానికి సంబంధించి భారత్-చైనా మధ్య ఏకాభిప్రాయం కుదిరే వరకూ వాస్తవాధీన రేఖకు కట్టుబడి ఉండాలని గతంలో కుదిరిన ఒప్పందాలు చెబుతున్నాయి. అక్కడి స్థానికుల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఈ నిబంధనలన్నీ తరచూ అతిక్రమిస్తూ భారత్‌కు వరుస సవాళ్లు విసురుతోంది.

కర్ణాటకను మహారాష్ట్రలో కలిపేస్తారా? -ఇంచు కూడా ఇవ్వం: ఠాక్రేపై యడ్డీ ఫైర్ -ముదిరిన సరిహద్దు వివాదంకర్ణాటకను మహారాష్ట్రలో కలిపేస్తారా? -ఇంచు కూడా ఇవ్వం: ఠాక్రేపై యడ్డీ ఫైర్ -ముదిరిన సరిహద్దు వివాదం

English summary
China has constructed a new village in Arunachal Pradesh, consisting of about 101 homes, show satellite images accessed exclusively says NDTV. The same images, dated November 1, 2020, have been analysed by several experts approached by media, who confirmed that the construction, approximately 4.5 kms within Indian territory of the de facto border, will be of huge concern to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X